ఇరాన్ లో అధికారం మారబోతోందా ? తిరుగుబాటుకు షా వారసుడి పిలుపు..! అమెరికా అండ ?

ఇరాన్-అమెరికా మధ్య అణు ఒప్పందం చర్చలు జరుగుతున్న అకస్మాత్తుగా క్షిపణలు సంధించి యుద్ధానికి తెరలేపిన ఇజ్రాయెల్ దాన్ని రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇరాన్ అణుస్ధావరాలు, శాస్త్రవేత్తల లక్ష్యంగా ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు ఆ దేశంలోని చమురు నిల్వలపైకీ మళ్లింది. మరోవైపు తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ లో ఏమీ మిగలదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ లో అధికార మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇరాన్ పై పోరాటంలో ఇజ్రాయెల్ కు సహకరించేందుకు సిద్దమవుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సుప్రీం లీడర్ ఖమేనీని బేషరతుగా లొంగిపోవాలని కోరడం, ఆయన ససేమిరా అనడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్ పై దాడులు చేసి ఖమేనీని అంతం చేసేందుకు లేదా కనీసం అధికార మార్పిడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి మద్దతుగా ఖమేనీ కంటే ఇరాన్ పాలకుడిగా ఉన్న షా కుమారుడు, దేశ బహిష్కిృతుడైన ప్రిన్స్ రెజా పహ్లావీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

will regime change inevitable in iran what shah s successor reza pahlavi say

ఇజ్రాయెల్ తో యుద్దం ముదురుతున్న వేళ ఇరాన్ ప్రజలనుద్దేశించి షా కుమారుడు రెజా పెహ్లావీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ దాని ముగింపుకు వచ్చిందని, కూలిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని, కలిసి మనం చరిత్ర పేజీని తిప్పుతామని తెలిపారు. భయపడిన ఎలుకలాగా ఖమేనీ భూగర్భంలో దాక్కున్నాడని, దేశంపై నియంత్రణ కోల్పోయాడని తెలిపారు. ఈ క్లిష్ట రోజుల్లో, ఖమేనీ యుద్ధోన్మాదం, భ్రమలకు గురైన, బాధితులైన రక్షణ లేని పౌరులందరికీ తాను అండగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

will regime change inevitable in iran what shah s successor reza pahlavi say

సంవత్సరాలుగా, మన మాతృభూమి యుద్ధ అగ్నికి ఆహుతి కాకుండా నిరోధించడానికి తాను ప్రయత్నించానని, ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు అంటే ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా దాని 46 సంవత్సరాల యుద్ధం ముగింపే అన్నారు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినా ఇప్పటికీ ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్‌గా పరిగణించబడుతున్న రెజా పహ్లావి.. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అమెరికా అధికార మార్పిడికి చేస్తున్న ప్రయత్నాలకు బలం చేకూరేలా ఉంది.

మరోవైపు ఖమేనీ నేతృత్వంలోని పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా తిరుగుబాటు చేయాలని పహ్లావి పిలుపునిచ్చారు. పహ్లవి ఈ పీడకలని శాశ్వతంగా అంతం చేయడానికి ఇప్పుడు కావలసిందల్లా దేశవ్యాప్త తిరుగుబాటే అన్నారు. ఇప్పుడు మేల్కోవాల్సిన సమయమని, ఇరాన్‌ను తిరిగి పొందే సమయమని తెలిపారు. మనమందరం ముందుకు వచ్చి ఈ పాలనను అంతం చేద్దామన్నారు. ఇరాన్ భవిష్యత్తు, అభివృద్ధి కోసం తమ వద్ద ఒక ప్రణాళిక ఉందన్నారు. ఖమేనీ పతనం తర్వాత మొదటి వంద రోజులకు, పరివర్తన కాలానికి, ఇరాన్ ప్రజలచే, ఇరాన్ ప్రజలచే జాతీయ, ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+