వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్ట్ 11న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా: ఇమ్రాన్ ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచి: తాను ఆగస్ట్ 11వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ సోమవారం వెల్లడించారు. జూలై 25వ తేదీన జరిగిన ఎన్నికల్లో పీటీఐ అత్యధిక స్థానాలు గెలుచుకొని, మేజిక్ ఫిగర్‌కు సమీపంలో నిలిచింది. చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌కు భారత్ గట్టి జవాబు, ఆర్మీ రెండేళ్ల క్రితమే.. రెహామ్ ఖాన్ షాకింగ్ఇమ్రాన్‌ఖాన్‌కు భారత్ గట్టి జవాబు, ఆర్మీ రెండేళ్ల క్రితమే.. రెహామ్ ఖాన్ షాకింగ్

తాను వచ్చే నెల (ఆగస్ట్) 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని పాకిస్తాన్ రేడియో ద్వారా ఇమ్రాన్ వెల్లడించారు. అలాగే ఖైబర్ ఫంక్తుక్వా ముఖ్యమంత్రి ఎవరనేది మరో 48 గంటలలో చెబుతానని అన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు తాను సరైన వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉందన్నారు.

Will take oath as Pak PM on August 11: Imran Khan

కాగా, ఇమ్రాన్ ఖాన్ ఆగస్ట్ 14వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని శనివారం నాడు పార్టీ అధికార ప్రతినిధి నయీముల్ హక్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.

కాగా, 270 స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ సారథ్యంలోని పీటీఐ 116 స్థానాలు గెలుపొందింది. దీంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్‌ సమాయత్తమవుతున్నారు. త్వరలోనే పాక్‌ ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు.

English summary
Imran Khan today said that he will take oath as Pakistan's Prime Minister on August 11, according to a media report. The Pakistan Tehreek i Insaf, led by 65 year old Khan, has emerged as the single largest party in the National Assembly (NA) after the July 25 elections, but it is still short of numbers to form the government on its own.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X