వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ ప్రజల కోసం..: ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషి సునాక్ తొలి కీలక ప్రసంగం

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ ప్రజల కోసం అహర్నిశలు శక్తివంచన లేకుండా పనిచేస్తామని నూతన ప్రధానిగా ఎన్నికైన కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ అన్నారు. రిషి సునక్ సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని ఉద్దేశించి తన మొదటి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

'బ్రిటీష్ ప్రజలకు అందించడానికి అహర్నిశలు పని చేస్తానని, సమగ్రత, చిత్తశుద్ధితో సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాను' అని సునాక్ వ్యాఖ్యానించారు. 'మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, మన పిల్లలు, మనవరాళ్లకు మెరుగైన, మరింత సంపన్నమైన భవిష్యత్తును నిర్మించగల ఏకైక మార్గం' అని సునాక్ అన్నారు.

rishi sunak ప్రస్థానం: వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని వరకు, అంచెలంచెలుగాrishi sunak ప్రస్థానం: వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని వరకు, అంచెలంచెలుగా

రిషి తన ప్రత్యర్థి పెన్నీ మోర్డాంట్ పూర్తి మద్దతును వాగ్దానం చేసిన తర్వాత భారత సంతతికి చెందిన తొలి బ్రిటీష్ ప్రధానమంత్రి పదవి చేపడుతూ చరిత్ర సృష్టించారు. సెప్టెంబరులో ప్రధానమంత్రి పదవికి జరిగిన రేసులో లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయిన భారతీయ సంతతికి చెందిన రిషి సునక్..
ఈసారి ప్రధానమంత్రి రేసులో బలమైన పోటీదారుగా మారారు.

 Will Work For British People with integrity and humility: PM-Designate Rishi Sunak

'నా పార్లమెంటరీ సహోద్యోగుల మద్దతు, కన్జర్వేటివ్.. యూనియనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎన్నికైనందుకు వినయపూర్వకంగా, గౌరవించబడ్డాను. నేను ఇష్టపడే పార్టీకి సేవ చేయడం, నేను రుణపడి ఉన్న దేశానికి తిరిగి ఇవ్వగలగడం నా జీవితంలో గొప్ప అదృష్టం' అని నూతన ప్రధాని రిషి సునాక్ అన్నారు.

'యూకే ఒక గొప్ప దేశం, కానీ మేము లోతైన ఆర్థిక సవాలును ఎదుర్కొంటున్నాము. మనకు ఇప్పుడు స్థిరత్వం, ఐక్యత అవసరం, మన పార్టీని, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి నేను నా అత్యంత ప్రాధాన్యతనిస్తాను. అదే మేము సవాళ్లను అధిగమించి మా పిల్లలు, మనవళ్ల కోసం మంచి భవిష్యత్తును నిర్మించుకునే ఏకైక మార్గం' అని రిషి సునాక్ స్పష్టం చేశారు.

మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత, సునక్ ప్రధాన మంత్రి వాదన ధృవీకరించారు. ఆర్థిక సంక్షోభం, ఇద్దరు కీలక మంత్రుల రాజీనామాల కారణంగా బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల తర్వాత లిజ్ యూకే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

English summary
'Will Work For British People with integrity and humility': PM-Designate Rishi Sunak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X