అమెరికా గజగజ.. 2,700 విమానాలు రద్దు, స్కూళ్లు మూసివేత, గడ్డకట్టిన నయగారా!
వాషింగ్టన్: ఎముకలు కొరికే చలితో అమెరికా గజగజ వణికిపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు దట్టంగా కురిసిన మంచుతో నిండిపోయాయి. మరోవైపు గురువారం మంచు తుపాను విరుచుకుపడుతుందన్న హెచ్చరికతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
'బాంబ్ తుపాను'గా వ్యవహరిస్తున్న ఈ తుపానుతో అమెరికా ఈశాన్య ప్రాంతంలో 6 నుంచి 12 అంగుళాల మేర మంచు పడుతుందని, గంటకు 64 నుంచి 96 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌డబ్ల్యూఎస్) పేర్కొంది.
ప్రస్తుతం అమెరికాలోని సగ భాగం పూర్తిగా మంచు దుప్పట్లోనే ఉంది. ధృవప్రాంతమైన అంటార్కిటికా కంటే కూడా చల్లటి వాతావరణ అమెరికా నగరాలలో నెలకొంది. న్యూయార్క్‌లో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అంటార్కిటికాలో ఇది మైనస్ 16 డిగ్రీలే కావడం గమనార్హం.
{photo-feature}












Click it and Unblock the Notifications