అబ్బే, దావూద్ ఇబ్రహీం ఇక్కడలేడు - 24 గంటల్లోపే పాకిస్తాన్ యూటర్న్ - భారత మీడియాదే తప్పంటూ..
అతరరిక్ష పల్టీలు కొట్టడంలో దిట్టగా పేరుపొందిన పాకిస్తాన్ మరోసారి తన అలవాటును ప్రదర్శించింది. కరడుగట్టిన తీవ్రవాది, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం విషయంలో మళ్లీ మాట మార్చింది. దావుద్ కరాచీలోనే ఉన్నట్లు అంగీకరించి, అతని ఆస్తులు స్తంభింపజేసినట్లు చెప్పినా దాయాది దేశం 24 గంటలు కూడా తిరకకముందే యూటర్న్ తీసుకుంది. ఏకంగా విదేశాంగ శాఖ ద్వారా ఈ తాజా ప్రకటన చేయించింది..
కరోనా వ్యాక్సిన్: చైనా దొంగ పని - అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ - మాస్క్‌పైనా సంచలన నిర్ణయం

అసలేం జరిగిందంటే..
అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. తన ఉగ్రకార్యకలాపాలు తగ్గించుుకుంటే తప్ప సాయం చేసేది లేదని పలు దేశాలు, ఆర్థిక సంస్థలు బాహాటంగా ప్రకటించినా, దాని తీరు మారకపోవడంతో.. ప్యారిస్ కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) జూన్ 2018లో పాక్ ను గ్రే లిస్ట్ లో ఉంచింది. ఆ లిస్టు నుంచి బయటపడేందుకుగానూ టెర్రరిస్టులు, టెర్రర్ ఆర్గనైజేషన్లపై ఇమ్రాన్ ఖాన్ సర్కారు చర్యలకు దిగింది. ఆ క్రమంలోనే తాజాగా 88 నిషేధిత సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. అనూహ్యంగా అందులో డాన్ దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది. దీంతో, అతను పాక్ లోనే ఉన్నాడంటూ భారత్ చాలా కాలంగా చేస్తోన్న వాదనకు తిరుగులేని ఆధారం లభించినట్లయింది. డాన్ వార్తలు అంతర్జాతీయంగానూ వైరల్ కావడంతో పాక్ దిద్దుబాటు చర్యలకు దిగింది.

24 గంటల్లోనే యూటర్న్
పాక్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లలో జమాతే చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ ముసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరులతోపాటు దావూద్ ఇబ్రహీం పేరును కూడా నిషేధిత జాబితాలో పేర్కొంది. వాళ్ల స్థిర, చరస్తులను సీజ్ చేయడంతోపాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్లు తెలిపింది. కరాచీలోని వైట్ హౌజ్ ను దావూద్ చిరునామాగా పేర్కొంది. అయితే ఈ సంగతి బయటపడ్డ 24 గంటల్లోపే యూటర్న్ తీసుకున్న పాక్.. దావుద్‌కు తమదేశంలో చోటు లేదని బుకాయింపులకు దిగింది.
దారుణం:16 ఏళ్ల బాలికపై 30 మంది రేప్ - వికృత వీడియో వైరల్ - ప్రధాని తీవ్ర స్పందన

ఇమ్రాన్ సర్కారు తాజా ప్రకటన..
దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నట్లు వచ్చిన వార్తలపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో ఐసిస్, అల్‌ఖైదాల ప్రస్తుత స్థితిని వివరిస్తూ ఈనెల 18న రెండు నోటిఫికేషన్లు జారీ చేశామని, అయితే ఇది సాధారణ నోటిఫికేషనే అని, అంతర్జాతీయంగా తమకున్న బాధ్యతల మేరకు, చట్టపరమైన అవసరాల నిమిత్తమే ఎస్ఆర్ఓలను ప్రచురించామని, అందులో దావూద్ ఇబ్రహీం పేరు లేదని, అతనికి ఆశ్రయం కల్పించాల్సిన అవసరం తమకు లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది.

దావూద్‌పై భారత మీడియా అతి
‘‘పాకిస్తాన్ లో ఒకటి జరిగితే, దానిపై పూర్తి అవాస్తవాలను భారత మీడియా ప్రసారం చేస్తుంది. కొత్తగా మేమేదో ఈ రిపోర్ట్ ప్రచురించామని, తద్వారా సరికొత్త ఆంక్షలు విధించామని భారత మీడియా కథనాలు నడిపిస్తోంది. అవన్నీ దాదాపు అబద్ధాలే. నోటిఫికేషన్లో దావూద్ ఇబ్రహీం మా దేశంలోనే ఉన్నట్లు అంగీకరించామని చెప్పడం కల్పిత కథనాలే తప్ప నిజాలుకావు'' అని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ చౌధరి వివరించారు. దావూద్ విషయంలో పాక్ యూటర్న్ పై భారత సర్కార్ స్పందించాల్సి ఉంది.