కారణమిదే: వివాహమైన కొద్ది సేపటికే వధువు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ప్రేమించి పెళ్ళి చేసుకొన్న ఓ యువతి క్షణాల్లోనే మరణించింది.ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్‌లో చోటు చేసుకొంది. అనారోగ్యం కారణంగానే వధువు వివాహమైన కొంత సేపటికే మృతి చెందింది.

కనెక్టికట్‌కు చెందిన హెథర్‌, డేవిడ్‌ రెండేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. 2016లో హెథర్‌కి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉందని తేలింది. అప్పటికే వ్యాధి ముదరడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. 2017 డిసెంబర్‌ ఆఖరి వారంలో ఆమె పరిస్థితి దిగజారుతుండడంతో వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Woman Battling Breast Cancer Dies Just Hours After Her Hospital Wedding

సాధారణ పెళ్లిళ్లలాగే కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆస్పత్రిలోనే హెథర్‌, డేవిడ్‌లు వివాహ బంధంతో ఒకటయ్యారు. బెడ్‌పై ఉన్న హెథర్‌.. తన భర్త డేవిడ్‌తో ప్రేమగా మాట్లాడిన మాటలే ఆఖరి మాటలయ్యాయి.

డేవిడ్‌, కుటుంబ సభ్యుల ముందే హెథర్‌ కన్నుమూసింది. పెళ్లి సమయంలో హెథర్‌, డేవిడ్‌ దంపతులు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారాయి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
David Mosher, 35, and Heather Lindsay, 31, did get to say those words to each other just hours before Lindsay passed away after a one-year battle with breast cancer.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి