విజయ్ కార్ల నెంబర్ 0277 వెనుక ఎమోషనల్ స్టోరీ, తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

తమిళనాడు సీఎం విజయ్. సినీ స్టార్ గా అందరి మనసులు గెలిచి.. నేడు పొలిటికల్ స్టార్ గా ఎదిగారు. ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యేందుకు ఎన్నో కష్టాలు పడిన విజయ్ వెనుక మరెన్నో విషాదాలు ఉన్నాయి. విజయ్ వినియోగించే అన్ని కార్లకు 0277 నెంబర్ ఉంటుంది. అందరూ ఇది కలిసొచ్చేది.. ఫ్యాన్సీ నెంబర్ గా భావిస్తారు. కాదు, ఈ నెంబర్ వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.

విజయ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే తన పాత రోల్స్ రాయిస్ కారును విక్రయించి మూడు కొత్త విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేశారు. అందులో BMW ఎలక్ట్రిక్ కారు, Lexus LM, Toyota Vellfire ఉన్నాయి. రాజకీయ ప్రచారాల కోసం ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్ బస్సును వినియోగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ అన్ని వాహనాల నంబర్ ప్లేట్లలో "0277" అనే సంఖ్య ఉండటం. బీఎండ‌బ్ల్యూ కారు నంబర్ TN 14 AH 0277 కాగా, లెక్సస్ ఎల్ఎం కి TN 14 AL 0277, ట‌యోటా వెల్‌ఫైర్ కి TN 14 AM 0277 నంబర్లు ఉన్నాయి. అలాగే టీవీకే ప్రచార బస్సుకు కూడా TN 14 AS 0277 నంబరే ఉండటం అభిమానుల్లో ఆసక్తి రేపింది. అయితే ఈ సంఖ్య వెనుక ఒక బలమైన భావోద్వేగం దాగి ఉందని తెలిసి అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు.

CM Vijay 0277 on His Vehicles A Touching Tribute to His Late Sister Vidhya That Moves Fans

అయితే "0277" అంటే అసలు 14-02-77 తేదీని సూచిస్తుందని తెలుస్తోంది. అదే విజయ్ చిన్న చెల్లెలు విద్యా చంద్రశేఖర్ జన్మదినం. చిన్న వయసులోనే కన్నుమూసిన తన చెల్లెలి జ్ఞాపకాన్ని ఎప్పటికీ తనతో ఉంచుకోవాలని భావించిన విజయ్.. తన వాహనాలన్నింటికీ ఈ సంఖ్యను ప్రత్యేక గుర్తుగా పెట్టుకుంటున్నారు. విద్యా చంద్రశేఖర్ మరణం విజయ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో వెల్లడించారు. చిన్నతనం లో చాలా అల్లరి, చురుకుగా ఉండే విజయ్.. చెల్లెలి మరణం తర్వాత చాలా మౌనంగా మారిపో యారని ఆయన తల్లిదండ్రులు చెప్పిన విషయాలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా తిరుపాచి సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చూపించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. నిజ జీవిత బాధనే తెరపై ఆవిష్కరించారని అప్పట్లో అభిమానులు ప్రశంసించారు. అంతేకాదు, తన చెల్లెలి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు విజయ్. ఆయన తండ్రి చంద్రశేఖర్ తమ నిర్మాణ సంస్థకు "విద్యా-విజయ్ ప్రొడక్షన్స్" అని పేరు పెట్టారు. పేద పిల్లలకు విద్యా సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో కూడా విజయ్ ముందుంటున్నారు. విజయ్ సీఎం అయిన తరువాత ఇప్పుడు విజయ్ వెనుక ఉన్న ఈ విషాద ఘటన తెలుసుకున్న వారు ఎమోషనల్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+