సూర్య "వీరభద్రుడు" ఫస్ట్ రివ్యూ: సూర్య, త్రిష సంచలనం.. ఎపిక్ సంభవం లోడింగ్..!
తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గజిని సినిమాతోనే సూర్యకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. యముడు, సింగం, 24, ఆకాశమే హద్దురా, కంగువ, సెవెన్త్ సెన్స్, జై భీమ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వీడొక్కడే తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు సూర్య. అలా ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు సూర్య. అయితే సూర్య గత సినిమా కంగువ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత వచ్చిన రెట్రో మూవీ కూడా ఆశించినంత సక్సెస్ కాలేదు. దాంతో సూర్య ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు.

ఇక సూర్య తాజా సినిమా కరుప్పు ఈ నెల 14 న విడుదల కానుంది. ఈ మూవీని రేడియో బాలాజీ తెరకెక్కించాడు. కరుప్పు మూవీలో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ సినిమా వీరభద్రుడు అనే టైటిల్ తో విడుదల కానుంది. ఇప్పటికే తమిళంలో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే తాజాగా ఈ మూవీ ప్రివ్యూను చెన్నైలో వేశారు. ఈ షోకు సినీ ప్రముఖలు, మీడియా రిపోర్టర్స్ కూడా వచ్చారు. వాళ్ల నుంచి సినిమాకు వచ్చిన టాక్ ఏంటంటే..?
ఈ మూవీ ఫస్టాఫ్ చాలా ఇంటెన్స్ డ్రామాతో ఈ మధ్య కాలంలో సూర్య కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించేలా ఉందట. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్ డ్రామా అయినప్పటికీ సినిమాను కొంత మేరకు ల్యాగ్ చేశారని టాక్. అయితే క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ మూవీ ఆడియన్స్ కు నచ్చుతుందో లేదో చూడాలి. ఇక ఇప్పటికే రిలీజైన తెలుగు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.












Click it and Unblock the Notifications