రోడ్డుపై ఒక్క బ్యానర్ కనిపించినా..: స్ట్రిక్ట్ వార్నింగ్: పబ్లిక్ హ్యాపీ
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజుల్లోనే అక్కడి నియామకాలు చర్చనీయాంశమౌతున్నాయి. పాలనపై పట్టు పెంచుకునే క్రమంలో విజయ్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. తన అనుకున్న వాళ్లకు కీలక పదవుల్లో కూర్చోబెడుతున్నారు. ప్రభుత్వపరంగా కూడా వారి సేవలను వినియోగించుకోవడంలో వెనుకాడట్లేదు. మంత్రులకు శాఖలు కూడా కేటాయించిన నేపథ్యంలో ఇక అత్యున్నత స్థాయి అధికారుల నియామకాలపై దృష్టి పెట్టారు.
అదే సమయంలో అధికార టీవీకే.. పార్టీ క్యాడర్ కు కఠిన ఆదేశాలు ఇచ్చింది. పలు హెచ్చరికలను జారీ చేసింది. పార్టీకి చెందిన ఏ నాయకుడైనా, కార్యకర్త అయినా ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎటువంటి వేడుకలు జరుపుకొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. విజయ్ మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు కట్టినా చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

తమిళనాడు ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా టీవీకే ఆవిర్భవించిందని, అతి తక్కువ కాలంలో ప్రజలు పార్టీని ఆదరించారని, ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను అప్పగించారని టీవీకే గుర్తు చేసింది. ప్రజల నుంచి ఏకగ్రీవ విశ్వాసం పొందిన విజేతగా, తమిళ ప్రయోజనాల పరిరక్షణలో ముక్యమంత్రిగా తమ పార్టీ అధినేత విజయ్ నిమగ్నం అయ్యారని పేర్కొంది. అటువంటి నాయకుడు పార్టీకి గొప్ప బాధ్యతను అప్పగించారని, ఆ దిశగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించింది.
అందువల్ల, పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా రహదారులపై, ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడే ప్రదేశాల్లో లేదా ప్రజల రాకపోకలకు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా బ్యానర్లు, పోస్టర్లు లేదా ఇతరత్రా ఎలాంటి ప్రదర్శనలు నిర్వహించరాదని ఆదేశించింది. పుట్టినరోజు వేడుకలు, కుటుంబ కార్యక్రమాల వంటి సందర్భాలలోనూ ప్రజలకు అసౌకర్యం కలిగించే రీతిలో వ్యవహరించకూడదని పేర్కొంది. ఎలాంటి వేడుకలు, ఆటంకాలు కలిగించే పనులను చేయకూడదని స్పష్టం చేశారు.
தலைமை நிலையச் செயலக அறிவிப்பு
— TVK Party HQ (@TVKPartyHQ) May 12, 2026
கழகத் தோழர்கள் அனைவருக்கும் வணக்கம்.
தமிழ்நாட்டு மக்களின் நலன் ஒன்றையே குறிக்கோளாகக் கொண்டு தொடங்கப்பட்டதுதான் தமிழக வெற்றிக் கழகம். தமிழ்நாட்டு மக்களின் ஏகோபித்த நம்பிக்கையைப் பெற்ற, தமிழ்ச் சொந்தங்களின் குடும்பத்தில் ஒருவராக இருக்கக்கூடிய…
బ్యానర్లు, వేడుకలు లేదా మరే ఇతర మార్గాల ద్వారా ప్రజలకు ఆటంకం కలిగించినా, పార్టీ నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని టీవీకే ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్. ఆనంద్ తెలిపారు. పార్టీ అధి నాయకుడి ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications