పని నుండొచ్చాక ఆ భర్తకు నిద్ర తప్ప..: కోర్టుకెక్కిన భార్య, విడాకులు
ఈజిప్ట్: తన భర్త నిద్రకు బానిసయ్యాడని, దీంతో తనకు ఇబ్బందిగా మారిందని తనకు విడాకులు ఇప్పించాలని ఓ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంఘటన ఈజిప్ట్ దేశంలో చోటు చేసుకుంది. ఆమె పిటిషన్ సరైనదిగా భావించిన ఆ కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది.
తన భర్త ఎప్పుడు నిద్రపోతున్నారని, ఆయన నిద్రకు బానిసయ్యాడని, తనకు విడాకులు ఇప్పించాలని ఆమె కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లుగా అరబిక్ ఓ డెయిలీ న్యూస్ పేపర్‌లో వార్తలు వచ్చాయి.

ఆ భార్యాభర్తలిద్దరికి పెళ్లై నెల రోజులే అవుతోంది. ఆమె తన పిటిషన్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన భర్త ఉద్యోగం నుండి వచ్చాక రోజుకు పదిహేను గంటలు పడుకుంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తన భర్త ఎప్పుడు నిద్రిస్తున్నందున తామిద్దరం మాట్లాడుకునేందుకు సమయమే దొరకడం లేదని, అతను ఇలా నిద్రిస్తాడని పెళ్లికి ముందు తనకు తెలియదని పేర్కొంది.
తమ స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు నిద్రలోనే ఉంటున్నాడని, ఈ విషయమై తాను పలుమార్లు అతని పైన అసహనం ప్రదర్శించానని అయినప్పటికీ మార్పు లేదని పేర్కొంది. భర్త మాత్రం.. తనకు ఎలాంటి జబ్బు లేదని, కానీ నిద్రకు అలవాటుపడిపోయానని చెప్పాడు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications