వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాను చంపుతానన్న మహిళకు రెండేళ్ల జైలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను చంపుతానని బెదిరింపులకు పాల్పడిన ఓ 56ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు దాదాపు రెండేళ్ల జైలు శిక్ష పడిందని ఫెడరల్ అధికారులు తెలిపినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.

హూస్టన్‌కు చెందిన డేనిస్ ఓ నేల్ అనే ఆ మహిళ టెడ్డీ బేర్ పారడైస్ పేరుతో బెదిరింపులకు పాల్పడిందని ఫెడరల్ అధికారులు చెప్పారు. ఓ లేఖను పంపి ఒబామాను చంపుతానని బెదిరింపులకు పాల్పడిందని హూస్టన్ క్రానికల్ కథనం ప్రచురితం చేసింది.

Woman gets jail term for threatening to kill Barack Obama

మంగళవారం కేసు విచారించిన హూస్టన్ కోర్టు ఆమెకు రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అమెరికా అధ్యక్షుడ్ని బెదిరింపులకు గురిచేసినట్లు ఆగస్టులోనే రుజువైనట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు.

తాను వాష్టింగ్టన్ డిసికి వస్తున్నానని, అక్కడి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను చంపుతానని ఆయనకు నిందితురాలు ఓ లేఖ పంపిందని ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో విచారించిన కోర్టు.. ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష విధించిందని చెప్పారు.

English summary
Federal authorities in US have sentenced a 56-year-old woman to nearly two years in jail for threatening to kill President Barack Obama, media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X