రేప్‌యత్నం: పెప్పర్ స్ప్రేతో అడ్డుకుందని చంపేశారు, తండ్రీకొడుకుల అరెస్ట్

టర్కీ: ఓ మహిళ తన పైన అత్యాచారయత్నాన్ని అడ్డుకున్నందుకు ఆమెను హత్య చేసిన దారుణ సంఘటన టర్కీలో జరిగింది. దీనిని నిరసిస్తూ వందలాది మంది మహిళా హక్కు నాయకురాళ్లు రోడ్డెక్కారు. మృతి చెందిన 20 ఏళ్ల యువతి బాడీ మెర్సిన్ నగరం యొక్క రివర్ బెడ్ వద్ద కనిపించింది. శుక్రవారం దీనిని గుర్తించారు.

ఈ హత్యకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో మినీ బస్ డ్రైవర్, అతని తండ్రి, స్నేహితుడు ఉన్నారు.

సమాచారం మేరకు.. మినీ బస్ డ్రైవర్ యువతి పైన అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె అతని నుండి తప్పించుకునేందుకు పెప్పర్ స్ప్రేను ఉపయోగించింది. దీంతో అతను ఆమెను కొట్టాడు. ఐరన్ పైప్‌తో ఆమె తల పైన బాగా కొట్టాడు.

Woman killed for resisting rape, Turkey fum

మృతురాలు గత బుధవారం నాటి నుండి కనిపించడం లేదు. ఆమె మినీ బస్సులో ఎక్కిన తర్వాత నుండి కనిపించడం లేదని గుర్తించారు. ఆ కోణంలో పోలీసులు విచారణ జరిపి, ఆమెను హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ హత్య టర్కీలో తీవ్ర ఉద్రిక్తతను రేపింది. టర్కీష్ ప్రెసిడెంట్ మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన సంతాపం తెలియజేశారు.

ఆమె మృతి నేపథ్యంలో మహిళా సంఘం నాయకురాళ్లు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. రాజధాని అంకారా, అతిపెద్ద సిటీ అయిన ఇస్తాంబుల్, మెర్సిన్ తదితర నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మహిళల పైన ఇలాంటి దుర్మార్గం దారుణమని వారు ప్లకార్డులు పట్టుకున్నారు. ప్రతిపక్ష నేత ట్విట్టర్‌లో దీనిపై స్పందించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+