4గురు బాయ్‌ఫ్రెండ్స్‌తో..: 30ఏళ్లైనా పెళ్లి లేదు, పిల్లలు లేరని స్త్రీ ఆత్మహత్య
లండన్: తనకు ముప్పై ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని, పిల్లలు లేరని మనస్తాపం చెందిన ఓ మహిళ బలవన్మరణం చెందింది. ఇతరులు తన భర్త, పిల్లలతో హాయిగా జీవిస్తున్నారని, తాను మాత్రం ఇంకా పెళ్లి కాకుండా ఉన్నాననే ఆవేదనతో ఆమె ఆత్మహత్య చేసుకుందని సమాచారం.
ఆత్మహత్య చేసుకున్న మహిళ ముగ్గురితో గతంలో రిలేషన్‌షిప్ కలిగి ఉంది. తాజాగా మరో బాయ్ ఫ్రెండ్ కూడా ఆమెను వదిలి వెళ్లి పోయేందుకు సిద్ధమయ్యాడు.

ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు తన ప్రస్తుత బాయ్ ఫ్రెండ్‌కు ఓ సందేశం పంపించింది. నీ భవిష్యత్తు బాగుండాలని అని మెసేజ్ పెట్టి ఆ తర్వాత తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడింది.
త్వరలో ఆమె తల్లి డెత్ అనివర్సరీ ఉందని, ఆ తర్వాత ఆమె 30వ పుట్టిన రోజు ఉందని ఆమె తాజా బాయ్ ఫ్రెండ్ చెప్పారు. తన తోటి వాళ్లు పెళ్లి చేసుకొని, పిల్లల్ని కలిగి ఉన్నారని, తాను మాత్రం అలా లేనని బాధపడేదని చెప్పారు.












Click it and Unblock the Notifications