తాడు అనుకుని పామును పట్టేసింది: ఏమైందంటే(వీడియో)

Subscribe to Oneindia Telugu

కాలిఫోర్నియా: బొమ్మ లేదా తాడు అనుకుని ఓ మహిళ విష సర్పాన్ని చేతులతో పట్టుకుని పైకి లేపింది. అప్పుడే అది పాము అని ఆమెకు అర్థమైంది. వెంటనే కిందపడేసి కేకలు వేసుకుంటూ పరుగులు తీసింది. ఆమెతో వచ్చిన కుక్క కూడా పరుగు లంకించింది. ఈ ఘటన అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలు చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితో.. ఓ మహిళ ఇటీవల తన ఇంటి ప్రాంగణంలో నడుస్తుండగా.. గేటు వద్ద ఏదో వస్తువు పడి ఉన్నట్లు కన్పించింది. దూరం నుంచి చూస్తే అది తన పెంపుడు కుక్క ఆడుకునే బొమ్మలా కన్పించింది. దాన్ని తీసుకునేందుకు కిందకు వంగి చేత్తో పట్టుకుంది. అంతే, అది బొమ్మ కాదు పాము అని అర్థమైంది. ఒక్కసారిగా భయంతో హడలిపోయిన ఆ మహిళ అక్కడి నుంచి పరుగు తీసింది. మహిళను అనుసరిస్తూ వచ్చిన ఆమె పెంపుడు కుక్క కూడా పామును చూసి పరుగులుపెట్టింది.

వెంటనే ఆ మహిళ కుటుంబసభ్యులు అటవీశాఖకు ఫోన్‌ చేయడంతో.. వారు వచ్చి పామును తీసుకెళ్లారు. 'బొమ్మ లేదా తాడు అనుకుని తీయబోయాను. ఇంతలో మొత్తగా నా చేతికి తగిలింది. అప్పుడర్థమైంది అది పాము అని' అని సదరు మహిళ మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను మహిళ భర్త యూట్యూబ్‌లో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.

కాగా, ఆ మహిళ మాత్రం తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎందుకంటే ఆ పాము పిల్ల అతి ప్రమాదకరమైందట. ఆ జాతికి చెందిన పాములు విషాన్ని కంట్రోల్‌ చేసుకోకుండా చిమ్ముతూనే ఉంటాయని తెలిపారు. ఆ పాము కాటు వేయకపోవడంతో అదృష్టవశాత్తు ఆ మహిళ ప్రాణాలతో బయటపడిందని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman in Southern California experienced the scare of her life when she picked up what she thought was a dog toy.
Please Wait while comments are loading...