విమానంలో మహిళను కుట్టిన తేలు, ఆ తర్వాత ప్లేన్ ఎక్కలేదు
లాస్ ఏంజిల్స్: విమానంలో ఓ మహిళను తేలు కుట్టింది. ఈ సంఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో శనివారం రాత్రి జరిగింది. విమానం రన్ వే పైన కొద్ది దూరం వెళ్లగానే మహిళా ప్రయాణికురాలి చేతి పైన ఉన్నట్లుండి తేలు కాటు వేసింది. దీంతో ఆ విమానాన్ని తొలుత రన్ వే పైన నిలిపారు.
అనంతరం వైద్యులు అక్కడకు వచ్చి, ఆమెకు చికిత్సను అందించారు. అదనపు వైద్య సహాయాన్ని నిరాకరించిన ఆమె తిరిగి విమానం ఎక్కలేదు.

ఆ తర్వాత విమాన సిబ్బంది ఆ తేలును చంపేశారు. అది అలస్కా ఎయిర్ లైన్స్ విమానం. మెక్సికోలోని లాస్ కాబోస్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు చేరుకున్న విమానం.. ఘటన అనంతరం 40 నిమిషాలకు ఓరేగాన్‌లోని పోర్ట్‌లాండ్‌కు తిరిగి బయలుదేరింది. కాగా, సదరు తేలు విమానంలోకి ఎలా వచ్చిందో తెలియడం లేదని సిబ్బంది చెప్పారు.












Click it and Unblock the Notifications