స్మార్ట్‌ఫోన్‌కి బానిసైన యువతి: చేతి వేళ్లు వంగిపోయాయి!, చికిత్స చేసిన వైద్యులు, జాగ్రత్త!
బీజింగ్: నేటి యువతరం మొబైల్ ఫోన్లకు ఎంత బానిసగా మారారో ఈ ఘటన తెలియజేస్తోంది. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. చైనాకు చెందిన ఓ యువతి స్మార్ట్ ఫోన్ నిరాంతరంగా వాడటంతో ఆమె చేతి వేళ్లు ఏకంగా వంగిపోవడం గమనార్హం.

స్మార్ట్‌ఫోన్ బానిస
వివరాల్లోకి వెళితే.. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతి స్మార్ట్ ఫోన్‌కు బానిసగా మారింది. తన ఉద్యోగానికి వారం రోజులు సెలవు పెట్టి మరీ సమయన్నంతా ఫోన్‌ను వినియోగిస్తూనే ఉంది. కేవలం నిద్రపోయే సమయంలోనే ఆమె తన ఫోన్‌ను పక్కనపెట్టేవారు.

వంగిపోయిన చేతివేళ్లు..
ఇలాగే రోజు చేయడంతో చేతులు నొప్పిపెట్టి.. చివరికి ఆమె వేళ్లు వంగిపోయి బిగుసుకుపోయాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఏ విధంగా పట్టుకుని ఉందో అదే పొజిషన్‌లో ఆమె వేళ్లు కూడా ఉండిపోయాయి. తిరిగి మామూలు స్థితికి రాలేకపోయాయి.

చికిత్స చేసిన వైద్యులు.. సూచన
ఈ క్రమంలో ఆమె వైద్యులను సంప్రదించకతప్పలేదు. ఆమెకు చికిత్స చేసిన వైద్యులు.. తిరిగి ఆమె చేతివేళ్లను మామూలు స్థితికి తీసుకువచ్చారు. అయితే, స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని వైద్యులు సూచించారు.
వీడియో వైరల్
ఆమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికైనా యువత తమ స్మార్ట్ ఫోన్లను అవసరం మేరకే వాడుకుంటే మంచిది. లేదంటే ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి తప్పకపోవచ్చు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications