• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

HIV మహిళకు Covid: 216 రోజుల్లో వైరస్ 32 సార్లు మ్యూటేషన్ - భారత్‌లో బీభత్సమే: షాకింగ్ రీసెర్చ్

|

ఏడాదిన్నరకుపైగా ప్రపంచాన్ని ఆటాడుకుంటోన్న కరోనా వైరస్ ఇప్పటికే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దాదాపు కుప్పకూల్చింది. ఆదివారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 17.37కోట్లు దాటగా, మరణాల సంఖ్య 37.36లక్షలకు పెరిగింది. ప్రాంతానికో తీరుగా మారుతోన్న వైరస్.. కొత్త వేరియంట్లుగా, మూటేషన్లుగా మరింత బలపడుతున్నది. కరోనాపై పరిశోధనలో రోజుకో సంచలన విషయం బయటపడుతున్నది. తాజాగా ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ఐవీతో కొవిడ్ వైరస్ కాంబినేషన్ పై షాకింగ్ రిపోర్టు ఒకటి బయటికొచ్చింది..

కొవాగ్జిన్, స్పుత్నిక్ చెల్లవు, అమెరికాలో చదవాలంటే రీవ్యాక్సినేషన్-భారతీయ విద్యార్థుల వర్సిటీల హుకుం కొవాగ్జిన్, స్పుత్నిక్ చెల్లవు, అమెరికాలో చదవాలంటే రీవ్యాక్సినేషన్-భారతీయ విద్యార్థుల వర్సిటీల హుకుం

హెచ్ఐవీ రోగిలో 32 సార్లు..

హెచ్ఐవీ రోగిలో 32 సార్లు..

కరోనా వైరస్, దాని వల్ల కలిగే కరోనా వైరస్ డిసీజ్(కొవిడ్) వ్యాధిపై ప్రపంచం నలుమూలల్లో అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చైనాలో పుట్టిన కొవిడ్ మూలాలలను కనిపెట్టనిదే వైరస్ ను అంతం చేయలేమని అమెరికా వాదిస్తుండటం, ఆ దిశగా దర్యాప్తునకు కూడా జోబైడెన్ ఆదేశించడం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా సౌతాఫ్రికాలో మాత్రం కొవిడ్ వైరస్, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ)ల కలయికపై లోతైన అధ్యయనాలు సాగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో 36 ఏళ్ల హెచ్‌ఐవీ పాజిటివ్ మహిళ శరీరంలో కరోనా వైరస్ 32 సార్లు మ్యూటేషన్ చెందినట్లు సైంటిస్టులు గుర్తించారు..

జగన్.. ఇవే ప్రశ్నలు మోదీని అడగరేం? -మీరు, నవీన్ బీజేపీకి మిత్రులేకదా! -వ్యాక్సిన్ల రాజకీయంలో అనూహ్య మలుపుజగన్.. ఇవే ప్రశ్నలు మోదీని అడగరేం? -మీరు, నవీన్ బీజేపీకి మిత్రులేకదా! -వ్యాక్సిన్ల రాజకీయంలో అనూహ్య మలుపు

ఎయిడ్స్-కొవిడ్‌పై షాకింగ్ రిపోర్ట్..

ఎయిడ్స్-కొవిడ్‌పై షాకింగ్ రిపోర్ట్..

దక్షిణాఫ్రికాలో ఇప్పటికే గుర్తించిన ఎయిడ్స్ రోగుల సంఖ్య 78లక్షలుకాగా, 3లక్షల మంది టీబీతో బాధపడుతున్నారు. వీళ్లలో కొందరికి కరోనా వైరస్ సోకగా, వెస్ట్రన్ కేప్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ వారు సదరు ‘హెచ్ఐవీ-కొవిడ్' రోగుల్ని ప్రత్యేక వార్డుల్లో ఉంచి ట్రీట్మెంట్ అందించడంతోపాటు వారి శరీరంలో చోటుచేసుకున్న మార్పులను నిశితంగా అధ్యయనం చేసి, ఓ రిపోర్టును తయారు చేశారు. ప్రముఖ మెడికల్ జర్నల్ medRxiv ఆ రిపోర్టును ప్రచురించింది. హెచ్ఐవీ పాజిటివ్ మహిళ ఒకరు 216రోజులపాటు కొవిడ్ వ్యాధితో బాధపడిందని, ఆ సమయంలో ఆమె శరీరంలో కరోనా వైరస్ 32 సార్లు మ్యూటేషన్ చెందిందని రిపోర్టులో పేర్కొన్నారు. ఆ 32 వేరియంట్లలో ఆల్ఫా వేరియంట్ B.1.1.7 (UK లో గుర్తించిన) భాగమైన E484K మ్యుటేషన్, బీటా వేరియంట్ B లో భాగమైన N510Y మ్యుటేషన్ వంటివి ఉండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది.

అందుకే 32 సార్లు మ్యూటేషన్..

అందుకే 32 సార్లు మ్యూటేషన్..

ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతోన్న మహిళా శరీరంలో కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ కూడా 13 సార్లు మ్యూటేషన్‌ చెందిందని, ఇలా జరగడం ద్వారా.. వైరస్ ఆమె శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌‌ను తప్పించుకోగలిగిందని, ఇక, వైరస్ మరో 19 మూటేషన్‌లో దాని ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చిందని రిపోర్టులో పేర్కొన్నారు. medRxiv లో రిపోర్టు జర్నో టూలియో డీ ఓలివైరా మాట్లాడుతూ.. ఒకవేళ ఇలాంటివి మరిన్ని కేసులు గుర్తిస్తే.. వైరస్ కొత్త వేరియంట్స్‌కు హెచ్‌ఐవీ సంక్రమణ మూలంగా మారే అవకాశాన్ని పెంచుతుందని, ఎయిడ్స్ రోగుల్లో కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి.. అది వైరస్ మ్యూటేషన్ చెందడానికి అవకాశం ఇస్తుందని చెబుతున్నారు.

కొత్త వేరియంట్లకు కారణం ఇదేనా?

కొత్త వేరియంట్లకు కారణం ఇదేనా?

హెచ్ఐవీ పాజిటివ్ మహిళ శరీరంలో 216రోజులు ఉన్న కరోనా వైరస్ 32 సార్లు మ్యూటేషన్ చెందినట్లు గుర్తించిన సైంటిస్టులు.. సదరు మహిళ నుంచి ఆ వేరియంట్లు ఇతరులకు వ్యాపించాయా లేదా అని కచ్చితంగా చెప్పలేమన్నారు. కాగా, దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటాల్ తదితర ప్రాంతాల్లో కొత్తరకం వేరియంట్లు పుట్టుకురావడం యాదృచ్చికం కాదని, ఆ ప్రాంతంలో ప్రతి నలుగురిలో ఒకరు హెచ్ఐవీ పాజిటివ్ కావడం వల్లే కొత్త వేరియంట్లు ఉద్బవిస్తుండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. నిజానికి..

  Telangana రోజుకు కోటి టీకాలు ఇవ్వండి.. కేంద్రానికి Congress లేఖ !!
  ప్రమాదం తక్కువే కానీ, భారత్‌లో పరిస్థితి?

  ప్రమాదం తక్కువే కానీ, భారత్‌లో పరిస్థితి?

  ఇతర వ్యాధుల(బీపీ, షుగర్, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత)వారితో పోల్చుకుంటే ఎయిడ్స్ రోగులు కరోనాతో చనిపోతున్న ఉదంతాలు తక్కువే కానీ, కొత్త వేరియంట్లు, మ్యూటేషన్ల వ్యాప్తికి హెచ్ఐవీ దోహదం చేస్తుందని, అప్పుడు ప్రపంచమంతా కరోనా వేరియంట్ల కర్మాగారంగా మారిపోతుందని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. హెచ్ఐవీ రోగుల్లో కరోనా మ్యూటేషన్లు.. కొవిడ్ వ్యాప్తికి మధ్య సంబంధాలను గుర్తించేలా లోతైన అధ్యయనాలు జరగాల్సి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ లెక్కన భారత్ లో 10 లక్షల మంది హెచ్ఐవీ రోగులు ఉండటం, వారిలో ఎంత మందికి కొవిడ్ సోకింది, వారిలో ఏవైనా మ్యూటేషన్లు చోటుచేసుకున్నాయా అనే అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎయిడ్స్ రోగులు చాలా మంది కొవిడ్ నుంచి కోలుకున్నా, వేరియంట్ల విషయంలోనే అనుమానాలున్నాయి..

  English summary
  Researchers in South Africa have found potentially dangerous coronavirus mutations in a 36-year-old woman with advanced HIV. The woman carried the Covid-19 virus for 216 days and during this period, the virus gathered more than 30 mutations. studies suggest a strong link between mutation and the spread of Covid-19 virus in HIV patients, it would be a cause of worry for India, which has almost 1 million people with untreated HIV infections.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X