పాకిస్థాన్ కు ప్రపంచబ్యాంకు భారీ సాయం.. భారత్ అలర్ట్..!

పాకిస్థాన్ కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని ఆమోదించింది. 700 మిలియన్ డాలర్ల సాయాన్ని ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ లోని ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అలాగే సేవారంగాన్ని పెంపోందించేందుకు వరల్డ్ బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించినట్లు సమాచారం. పబ్లిక్ రీసోర్స్ ఫర్ ఇన్ క్లూజివ్ డెవలప్ మెంట్ మల్టీఫేజ్ ప్రోగ్రామాటిక్ అప్రోచ్(PRID-MPA) లో భాగంగా మొత్తం 1.35 బిలియన్ డాలర్ల సాయాన్ని వరల్డ్ బ్యాంకు అప్రూవల్ చేసినట్లు డాన్ పత్రిక కథనం ద్వారా వెల్లడవుతోంది. ఇందలో 600 మిలియన్ డాలర్లను ఫెడరల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కు అలాగే 100 మిలియన్ డాలర్లు సింధ్ రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు కేటాయించింది.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్థాన్ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. అలాగే పాక్ పై అనేక కఠినమైన ఆంక్షలు విధించింది భారత్. సింధూ జలాల నిలిపివేతతోపాటుగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. అలాగే ఇతర పలు కారణాలతో పాకిస్థాన్ ఆర్థిక రంగం దెబ్బతిన్నది. ఈ క్రమంలో పాకిస్థాన్ లోని ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు వరల్డ్ బ్యాంకు మొత్తం 1.35 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. దానిలో భాగంగా తాజాగా 700 మిలియన్ డాలర్ల సాయాన్ని ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక ఇటీవల పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం ఈ ఏడాది ఆగస్టులో 47.9 మిలియన్ డాలర్లు సాయం చేసింది. తాజాగా మరో 700 మిలియన్ డాలర్లు ఆమోదించింది వరల్డ్ బ్యాంకు. ఈ విషయాన్ని పాకిస్థాన్ లోని వరల్డ్ బ్యాంకు ఆఫీసర్ బోలోర్మా అంగాబజార్ ధృవీకరించారు. పాకిస్థాన్ లో సమీకృత, సుస్థిర అభివృద్ది కోసం దేశీయంగా ఉన్న రీసోర్స్ లను సమర్థవంతంగా వినియోగించి మెరుగైన ఫలితాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

World Bank Greenlights 700 Million Lifeline for Pakistan s Economy

పాకిస్థాన్ ప్రభుత్వంతో పాటు సింధ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పాఠశాలలు, క్లినిక్స్ ట్యాక్స్ వ్యవస్థలపై ఫండింగ్ చేస్తున్నట్లు బోలోర్మా అంగాబజార్ తెలిపారు. సామాజిక, పర్యావరణ పెట్టుబడులతో ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+