వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్లకు మేథో సంపత్తి హక్కుల మినహాయింపు- ప్రపంచబ్యాంకు నో- WTO చర్చల వేళ

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ వేళ పలు దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్ల తయారీదారులు మేథో సంపత్తి హక్కులు కోరుకుంటున్నారు. అయితే ఇలా వ్యాక్సిన్లకు మేథో సంపత్తి హక్కులు ఇవ్వడం వల్ల ఆయా వ్యాక్సిన్లు ప్రపంచంలో పలు దేశాలకు అందుబాటులో లేకుండా పోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వ్యాక్సిన్లను మేథో సంపత్తి హక్కుల జాబితా నుంచి మినహాయించే అంశంపై ప్రపంచ వాణిజ్య సంస్ధలో చర్చలు జరుగుతున్నాయి.

వ్యాక్సిన్లను మేథో సంపత్తి హక్కుల జాబితా నుంచి మినహాయించడం వల్ల ప్రపంచ దేశాలకు వాటి లభ్యత పెరుగుతుందని భారత్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలు కోరుతున్నాయి. అయితే ప్రపంచ బ్యాంకు మాత్రం దీనికి నిరాకరిస్తోంది. వ్యాక్సిన్లపై ప్రపంచ వాణిజ్య సంస్ధలో మేథో సంపత్తి హక్కుల మినహాయింపుకు నిరాకరిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ తెలిపారు. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్ధ వ్యాక్సిన్ల మేథో సంపత్తిహక్కులపై చర్చిస్తున్న తరుణంలో ప్రపంచ బ్యాంకు స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

World Bank opposes vaccine intellectual property waiver as WTO talks resume

వ్యాక్సిన్లకు మేథో సంపత్తి హక్కులు ఇవ్వకపోతే భవిష్యత్‌ ఆవిష్కరణలపై వీటి ప్రభావం పడుతుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాగే ఔషద తయారీ రంగంపైనా దీని ప్రభావం ఉంటుందని చెబుతోంది. దీనికి బదులుగా వ్యాక్సిన్ల లభ్యత పెంచేందుకు ధనిక దేశాలు పేద దేశాలకు తమ వద్ద మిగులు వ్యాక్సిన్లను ఇవ్వాలని ప్రపంచ బ్యాంకు సూచిస్తోంది. ఇలా వ్యాక్సిన్ల లభ్యత పెంచగలిగితే అంతర్జాతీయంగా వృద్ధి రేటు 2021లో 5.6 శాతంగా, 2022లో 4.3 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు తమ అంచనాల్లో పేర్కొంది.

English summary
World Bank President David Malpass said on Tuesday the bank does not support waiving intellectual property rights for COVID-19 vaccines at the World Trade Organisation out of concern that it would hamper innovation in the pharmaceuticals sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X