అదిరిపోయే టేస్ట్ ఉంటుందట : "మూత్రంతో బీరు తయారీ"

Subscribe to Oneindia Telugu

బెల్జియం : తినేప్పుడో.. తాగేప్పుడో.. గుర్తు రాకూడనివి గుర్తొస్తే డోకు వచ్చినంత పనవుతుంది. అలాంటిది.. ఏవైతే గుర్తుకు రావద్దో అలాంటి వాటితోనే ఓ పానీయం తయారు చేసి మీకందిస్తే..! అవును.. మందుబాబులకు కిక్కిచ్చే బీరు ఇకనుంచి మూత్రంతోను తయారవబోతుంది. అయితే ఇందులో అసహ్యించుకోవాల్సిన విషయమేమి లేదు.

మూత్రాన్ని పూర్తిగా శుద్ది చేసిన తర్వాత.. దాన్నుంచి బీరును తయారు చేసే ప్రక్రియను కనిపెట్టారు బెల్జియం శాస్త్రవేత్తలు. బెల్జియం ఘెంట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం.. భారీ కంటైనర్ లో సేకరించిన మూత్రాన్ని సోలార్ పవర్ తో పనిచేసే బాయిలర్ ద్వారా ముందు వేడి చేస్తారు.

అనంతరం మూత్రంలో ఉండే నైట్రోజన్, పొటాషియం, పాస్పరస్ వంటి ఖనిజాల నుండి మూత్రాన్ని వేరు చేయడంతో.. అది కాస్త నీరుగా మారుతుంది. ఈమధ్యే సెంట్రల్ ఘెంట్ లో 10రోజుల పాటు నిర్వహించిన మ్యూజిక్ థియేటర్ ఫెస్టివల్ లో 'పీ ఫర్ సైన్స్' పేరిట శాస్త్రవేత్తలు రూపొందించిన మెషీన్ ద్వారా వెయ్యి లీటర్ల మూత్రాన్ని సేకరించారు.

Would you drink beer made from URINE? Scientists create 'sewer to brewer' machine that turns pee into a drinkable beverage

ఇప్పుడా మూత్రంతో అత్యంత రుచికరమైన బీరును తయారు చేయబోతున్నట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రక్రియలో మూత్రం నుండి వేరయ్యే ఖనిజాలను పంటలకు ఎరువులుగా కూడా వినియోగించుకోవచ్చునని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మొత్తానికి మందుబాబులకు యూరిన్ బీర్ రుచి చూపించబోతున్నారు పరిశోధకులు. చూడాలి మరి.. తయారయ్యాక దీనిపై మందుబాబుల అభిప్రాయం ఎలా ఉంటుందో..!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After a few beers, you can find yourself needing to rush to the toilet to relieve yourself. But there may soon be a way to reverse this process, using urine to relieve thirst.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి