వావ్..7.4 కోట్ల నగదు.. లక్కీ డ్రా.. తెలిస్తే షాక్ అవుతారు

కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ కంపల్సరీ.. ఇప్పటికీ కొన్నిచోట్ల వేసుకోవడం లేదు. దీంతో బహుమతులు ఇస్తామని అట్రాక్ట్ చేస్తున్నారు.ఆస్ట్రేలియాకలో. వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు చేపట్టింది. భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యాక్సిన్‌ వేయించుకుంటే..ఫ్రీగా బీర్‌లు ఇస్తామని..అలాగే ఆయా ప్రాంతాల్లో అధిక ధరలు ఉండే ఆహార పదార్థాలు ఇస్తామని ప్రకటించింది. లాటరీ టికెట్లు ఇస్తామని కూడా ప్రకటించింది.

చాలామంది స్వచ్ఛంగా వ్యాక్సిన్ మీద అవగాహన కార్యక్రమలు చేపట్టారు. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రవేట్‌ కంపెనీల మానవతావాదులు ది మిలియన్ డాలర్ వ్యాక్స్ అలయన్స్ లాటరీని రూపొందించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే లాటరీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించింది. దీంతో ప్రజలనుంచి భారీ స్పందన వచ్చింది. వ్యాక్సిన్ వేయించుకోవటానికి భారీ సంఖ్యలో జనాలు కదిలివచ్చారు.

wow..australia woman wins rs 7.4 crores

30 లక్షల మంది ప్రజలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవటమే కాక ఈ లక్కీ డ్రాలో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. అలా 25 ఏళ్ల జోవాన్ ఝూ అనే మహిళ కూడా వ్యాక్సిన్ వేయించుకుని డ్రాలో తన పేరు నమోదు చేయించుకోగా..ఝూ 1 మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకుంది. ఆమెకు సదరు లక్కీ డ్రా అధికారులు ఫోన్ చేసి మీకులాటరీ తగిలిందని చెప్పటంతో ఝూ తన మాటల్ని తానే నమ్మలేకపోయింది. ఈ లాటరీలో వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ఝూ తమ కుటుంబ సభ్యుల కోసం వెచ్చించడమే కాక మిగిలి డబ్బుని భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకుంటానని ఝూ తెలిపింది. తనకు లాటరీ తగిలిందనే విషయాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని పట్టరాని సంతోషంగా తెలిపింది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. నిపుణులు మాత్రం జనవరిలో థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి మళ్లీ వేసవి ఎలా ఉంటుందోననే ఆందోళన ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎక్కడో.. ఎవరో కొందరు తీసుకోలేదు. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని విశ్వసించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+