క్రాష్: కనిపించిన అల్జీరియా విమానం శకలాలు

అల్జీరియాకు చెందిన పౌరవిమానం కూలిపోయినట్లు ఆ దేశం నిర్ధారించింది. గురువారం నాడు బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు బయలుదేరిన విమానం మాలి సమీపంలో కూలిపోయినట్లు నిర్ధారణ అయింది. అధికారులు విమాన శిథిలాలను కూడా కనుగొన్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో వాతావరణం అనుకూలంగా లేదు.
ఆ ప్రాంతానికి భయంకరమైన తుపాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆ కారణం వలనే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.విమానం బుర్కినా ఫాసోలో ప్రయాణం ప్రారంభించిన గంట వ్యవధిలో గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.
విషయం తెలిసిన వెంటనే ఫ్రెంచ్ ఫైటర్ జెట్ విమానాలు రంగంలోకి దిగాయి. అలాగే మాలి నైజీరియా సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న విమానాలు కూడా అల్జీరియా విమానం ఆచూకీ తెలుసుకోడానికి ప్రయత్నించాయి. చివరికి మాలి దేశం సమీపంలో శిథిలాలు దొరకడంతో విమానం కూలిపోయిందని అధికారులు నిర్థారించారు.












Click it and Unblock the Notifications