India vs China: మా మీద పడి ఏడుస్తారేంట్రా..!
భారత్ ప్రస్తుతం ఆత్మ నిర్భరతపై దృష్టి పెట్టింది. స్వదేశీ వస్తువులు, స్వదేశీ ఉత్పత్తులు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. ప్రపంచ దేశాల నుంచి ఎగుమతులు.. దిగుమతులను తగ్గించుకుంటోంది. ఈ క్రమంలో చైనా నుంచి కూడా గతంలో కంటే చాలావరకు వాణిజ్యం తగ్గిపోయింది. ఈ క్రమంలో చైనా.. భారత్ పై అక్కసు వెళ్ల గక్కుతూనే ఉంది. తమ ఉత్పత్తులను పక్కనబెట్టి భారత్ స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టడాన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేక పోతుంది.
మొన్నటి వరకూ పహల్గాం ఉగ్రదాడి సమయంలో పాకిస్థాన్ వెనకాల ఉండి దాడులను ప్రోత్సహించిన చైనా.. మరోసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించింది. భారత్ లో ప్రస్తుతం ఈవీ వాహనాల జోరు పెరిగింది. కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఈవీ వాహనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అయితే ఇదే విషయంపై చైనా.. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(WTO) లో భారత్ పై ఫిర్యాదు చేసింది. ప్రపంచ దేశాల ముందు భారత్ ను చులకన చేసే కుట్రకు దిగింది.
ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలపై భారత్ రాయితీలు ఇస్తోందని.. ఇది అంతర్జాతీయ వాణిజ్యం నిబంధనలకు విరుద్ధం అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో భారత్ పై ఫిర్యాదు చేసింది చైనా. భారత్ తోపాటు టర్కీ, కెనడా, ఇతర యూరోపియన్ దేశాలు కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాయని చైనా తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే విశ్లేషకులు మాత్రం.. చైనా- భారత్ మధ్య వాణిజ్యం తగ్గుముఖం పట్టడంతో భారత్ పై అక్కసును చైనా ఇలా ప్రపంచ దేశాల ముందు వెళ్లగక్కుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై భారత వాణిజ్య సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. చైనా చేసిన ఫిర్యాదును నిశితంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

గతంతో పోల్చితే చైనాతో వాణిజ్య సంబంధాలను భారత్ తగ్గించుకుంది. చైనా వస్తువులపై ఆధారపడడం తగ్గించి స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ లో చైనా వ్యాపారం సాగడం లేదని డ్రాగన్ కంట్రీ అక్కసు ప్రదర్శిస్తోందని పలువురు వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చైనాకు ఎగుమతులు కూడా భారత్ తగ్గించింది. భారత్- చైనా ల మధ్య వాణిజ్య లోటు క్రమంగా పెరుగుతోంది.












Click it and Unblock the Notifications