హు కంటే జిన్‌పింగ్ ఓపెన్, భారత్ సమస్యే: దలైలామా
ముంబై: టిబెట్ ఆధ్యాత్మికవేత్త, బౌద్దమత గురువు దలైలామా చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ పైన గురువారం ప్రశంసలు కురిపించారు. జీ జిన్‌పింగ్ చాలా ఓపెన్ మైండ్ గల వ్యక్తి అని, వాస్తవికత దృక్పథంతో ఆలోచించే వ్యక్తి అన్నారు. భారత్ - చైనా సంబంధాలను ఆయన ముందుకు తీసుకు వెళ్తారని ఆయన ఆకాంక్షించారు.
చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆయన మోడీతో భేటీ అయ్యారు. పలు ఒప్పందాల పైన సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో దలైలామా విలేకరులతో మాట్లాడారు.

చైనా - భారత్‌లు పరస్పరం విశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జిన్‌పింగ్ చాలా వాస్తవికత దృక్పథంతో ఆలోచిస్తారని, ఓపెన్ మైండ్‌తో ఆలోచిస్తారన్నారు. మాజీ అధ్యక్షులు హూజింటావో కంటే ఆయన ఓపెన్ మైండ్ అన్నారు. జీ జిన్‌పింగ్ భారత్ నుండి మరింత తెలుసుకోవచ్చునన్నారు.
ఢిల్లీలో టిబెటియన్స్ ఆందోళన పైన ఆయన స్పందించారు. టిబెట్ సమస్య ఎప్పుడు కూడా భారత్ సమస్యే అన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇప్పుడైనా, మరెప్పుడైనా బలవంతంగా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, బలవంతంగా కావన్నారు.












Click it and Unblock the Notifications