రూ.13 కోట్లకు పైగా వదులుకున్న యాహూ సీఈవో
యాహూ సీఈవో మరిస్సా మేయర్ ఈ ఏడాది బోనస్ వదులుకునేందుకు అంగీకరించారు. యాహూలో గతంలో లక్షలాది ఖాతాలు హ్యాక్ అయిన ఘటన పైన దర్యాఫ్తు అనంతరం బోర్డు మరిస్సా బోనస్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది.
శాన్ ఫ్రాన్సిస్కో: యాహూ సీఈవో మరిస్సా మేయర్ ఈ ఏడాది బోనస్ వదులుకునేందుకు అంగీకరించారు. యాహూలో గతంలో లక్షలాది ఖాతాలు హ్యాక్ అయిన ఘటన పైన దర్యాఫ్తు అనంతరం బోర్డు మరిస్సా బోనస్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. అందుకు ఆమె అంగీకరించారు.
హ్యాకింగ్ పైన బోర్డు జరిపిన దర్యాప్తులో కంపెనీ అసమర్థంగా వ్యవహరించిందని తేలింది. దీంతో ఈ పొరపాటుకు ఆమె బాధ్యత తీసుకున్నారు. 2014లో జరిగిన హ్యాకింగ్ ఘటనపై మరిస్సా మేనేజ్‌మెంట్ విచారణ ఆలస్యం చేసిందని తెలిపింది.

తాను కంపెనీ సీఈఓని అని, తన హయాంలో ఈ ఘటన జరిగిందని, కాబట్టి ఈ ఏడాది తన బోనస్‌ను, ఈక్విటీ గ్రాంట్‌ను వదులుకునేందుకు ఒప్పుకుంటున్నానని మరిస్సా తెలిపారు. ఆమెకు 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.13.34కోట్లు) బోనస్ రావాల్సి ఉంటుంది.
తన బోనస్‌ను కంపెనీలో కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులకు పంచాలని కోరారు. ఆమె 2012 నుంచి యాహూ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. హ్యాకింగ్ ఘటనపై దర్యాప్తు అనంతరం యాప్ టాప్ లాయర్ రోనాల్డ్ బెల్ బుధవారం రాజీనామా చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications