అంధ యువతికి చేదు అనుభవం: రెస్టారెంట్‌‌పై విమర్శ

లండన్: ఓ అంధ యువతి తనకు తోడుగా శునకంతో తెచ్చుకుందని.. ఆమెను రెస్టారెంట్‌ నుంచి వెళ్లగొట్టిన సంఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. లండన్‌కి చెందిన ఓ యువతి భోజనం చేసేందుకు స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్‌కి వెళ్లింది.

ఆమె అంధురాలు కావడంతో తోడుగా గైడ్‌ డాగ్‌ని వెంట తీసుకెళ్లింది. కాగా, శునకాన్ని వెంట తీసుకువచ్చావంటూ ఆ రెస్టారెంట్‌ యజమాని ఆమెను బయటకు వెళ్లగొట్టాడు. దీంతో ఆ యువతి కన్నీటితో అక్కడి నుంచి నిష్క్రమించింది.

యూకేలోని చాలా రెస్టారెంట్లలో గైడ్‌ డాగ్‌లకు అనుమతి ఇస్తారని.. ఇలా చేయడం సరికాదని సదరు యువతి తల్లి ఆవేదన వ్యక్తంచేసింది. రెస్టారెంట్‌కి ఎలాంటి వారైనా వచ్చే హక్కు ఉంటుందని.. వారిని ఈవిధంగా అవమానపరచడం సరికాదని ఆమె అన్నారు.

Yee Rah restaurant faces online backlash after blind woman and her guide dog told to leave

ఈ సంఘటన కారణంగా తన కూతురు ఎంతో బాధపడిందని ఆమె తెలిపారు. కాగా, ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ రెస్టారెంట్‌ ఫేస్‌బుక్‌ పేజీలో విమర్శల వర్షం కురిపించారు.

తాము మరోసారి ఈ రెస్టారెంట్‌కు వెళ్లేది లేదని కొందరు కస్టమర్లు తేల్చి చెప్పారు. సదరు రెస్టారెంట్ యాజమాన్యంపై ఆ యువతి కుటుంబం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వినియోగదారులెవ్వరూ ఈ రెస్టారెంట్‌కు రావొద్దని మరికొందరు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+