పెళ్లి వేడుకపై వైమానిక దాడి: మహిళలు, పిల్లలు సహా 20మంది మృతి
దుబాయి: యెమన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకపై వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందగా, 46 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువమంది పిల్లలు, మహిళలే ఎక్కువగా ఉన్నారు.
సౌదీ సైన్యం నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఆదివారం రాత్రి జరిపిన ఈ వైమానిక దాడుల నేపథ్యంలో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మృతదేహాలను హజ్జాలోని అల్ జుమ్‌హౌరీ ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కూడా ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications