Video: పసిబిడ్డలపై పైశాచికత్వం.. నగ్నంగా కట్టేసి నరకం చూపించారు
తల్లిదండ్రులు తమ పనులకు వెళ్తూ, నమ్మకంతో వదిలి వెళ్ళిన పసిపిల్లలపై ఓ డేకేర్ సెంటర్లో జరిగిన వేధింపుల వీడియోలు ఇంటర్నెట్ను కుదిపేస్తున్నాయి. అక్కడ ఆ పసి ప్రాణాలు అనుభవించిన నరకం వర్ణనాతీతం. యోగ్యకర్తలోని 'లిటిల్ ఆరెషా' డేకేర్ సెంటర్లో రెండేళ్ల వయసున్న పసిపిల్లలను నగ్నంగా ఉంచి, కనీసం కదలకుండా తాళ్లతో కట్టేసిన దృశ్యాలు వైరల్ కావడంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. నిద్రపోతున్న సమయంలో కూడా పిల్లలు కదలకుండా బంధించిన ఈ పైశాచికత్వం చూసి అధికారులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ దారుణాన్ని బయటపెట్టిన వైరల్ వీడియో సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించడంతో, ఇండోనేషియా ప్రభుత్వం ఉలిక్కిపడింది. యోగ్యకర్త మెట్రో పోలీస్ చీఫ్ ఎవా గునా పాండియా నేతృత్వంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. సుమారు 30 మందిని విచారించిన తర్వాత, ఈ ఘోరానికి కారణమైన ఫౌండేషన్ అధిపతి, మేనేజర్ మరియు మరో 11 మంది సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ 13 మంది కసాయిలు కటకటాల వెనుక ఉన్నారు.

పసిమొగ్గలపై పగబట్టిన కసాయిలు..
ప్రాథమిక విచారణలో వెల్లడైన నిజాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ డేకేర్ సెంటర్లో ఉన్న 103 మంది పిల్లల్లో, 53 మంది చిన్నారులు ఈ రాక్షసత్వానికి బాధితులుగా మారారు. వీరంతా కేవలం రెండేళ్ల వయసున్న వారే కావడం గమనార్హం. కేవలం కట్టేయడమే కాకుండా, వారిని శారీరకంగా హింసించినట్లు ఆధారాలు లభించాయి. సాక్ష్యాలను భద్రపరచడానికి, ఇతర పిల్లలకు ముప్పు కలగకుండా ఉండటానికి అధికారులు ఆ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేసి సీల్ చేశారు.
How cruel can humans truly be? 😔
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) April 28, 2026
Mu$lim managed child day care. Tying up innocent toddlers like animals in that inhumane Yogyakarta daycare, stripping them of dignity, and shattering their tiny psyches… forcing them to grow up drowning in fear and trauma.
This isn’t just… pic.twitter.com/7EN5PbqpH5
డేకేర్ సెంటర్లు ఆశ్రయాలా.. లేక నరకకూపాలా?
ఈ ఘటనతో ప్రైవేట్ డేకేర్ సెంటర్ల లైసెన్సింగ్, సిబ్బంది ప్రవర్తనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. సిబ్బంది నేపథ్యాన్ని తనిఖీ చేయకుండా నియమించుకోవడం, పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి డేకేర్ సెంటర్లో తప్పనిసరిగా లైవ్ సీసీటీవీ యాక్సెస్ తల్లిదండ్రులకు ఉండాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
న్యాయం కోసం పోరాటం
ప్రస్తుతం బాధితులైన 53 మంది చిన్నారులకు వైద్య- మానసిక చికిత్స అందిస్తున్నారు. "మీ బిడ్డలను రక్షించడానికి మేము దృఢంగా కట్టుబడి ఉన్నాం" అని చీఫ్ కమిషనర్ ఇహ్సాన్ ప్రకటించారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఒక పక్క తమ బిడ్డల పరిస్థితి చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటే, మరోపక్క ఆ రాక్షసులకు ఉరిశిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications