ప్రాణం తీసిన సెల్ఫీ: బ్రిడ్జిపైనుంచి పడి యువతి మృతి
మాస్కో: ఇటీవల అజాగ్రత్తగా సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా యువతలో మార్పు రావడం లేదు. అందరూ మెచ్చే సెల్ఫీ తీసుకోవాలనే కోరికతో.. ప్రమాదపుటంచుల సెల్ఫీలు దిగుతూ తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
తాజాగా రష్యాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అన్నా కృపేనికోవా(21) అనే యువతి ఓ బ్రిడ్జిపై నిలుచుని సెల్ఫీ తీసుకుబోయింది. ప్రమాదవశాత్తు 40 అడుగుల కిందకిపడిపోయి, ప్రాణాలు కోల్పోయింది.

టూరిజం గ్రాడ్యుయేట్ అయిన అన్నా ఓ ఫ్రెండ్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు మిగతా మిత్రులతో కలిసి విహారానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు ఓ వంతెన వద్దకు రాగా, అక్కడి ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు బస్సును ఆపి కిందికి దిగారు.
ఈ క్రమంలోనే అన్నా సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్నా మద్యం సేవించి ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తమలో ఎవరూ మద్యం సేవించలేదని అన్నా మిత్రులు పోలీసులకు తెలిపారు.












Click it and Unblock the Notifications