27 ఏళ్లకే రూ. 8,300 కోట్ల ఆస్తులు.. యూట్యూబర్ అరుదైన రికార్డ్ !
జిమ్మీ డొనాల్డ్సన్ (Jimmy Donaldson)... అంటే చాలా తక్కువ మంది మాత్రమే గుర్తుపట్టొచ్చు. కానీ యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్ బీస్ట్ అంటే తెలియని వారుండరు. యూట్యూబ్ లో పలు రకాల వీడియోలను చేస్తూ కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. 397 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్న ఈ 27 ఏళ్ల యువకుడు తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు. 27 ఏళ్లకే బిలియనీర్ల జాబితాలో చేరి సంచలనం సృష్టించాడు.
చిన్న వయసులోనే యూట్యూబర్ గా ప్రయాణం మొదలుపెట్టిన మిస్టర్ బీస్ట్.. వినూత్నమైన ఛాలెంజ్‌లు, భారీగా బహుమతులు ఇవ్వడం, ఫిలాంత్రోపీక్ కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. సెలబ్రిటీ నెట్ వర్త్ అంచనాల ప్రకారం... ప్రస్తుతం మిస్టర్ బీస్ట్ నికర ఆస్తి విలువ సుమారు 1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,300 కోట్లు) చేరుకుంది. ఇందులో ఎలాంటి వారసత్వ ఆస్తి లేకపోవకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫోర్బ్స్ నివేదికల ప్రకారం, 2023లో ఆయన ఆదాయం 223 మిలియన్ డాలర్లు మాత్రమే.

కార్యకలాపాలు..
2017లో "ఐ కౌంటెడ్ టు 100,000" అనే వీడియోతో ఆయనకు విస్తృత ప్రాచుర్యం లభించింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని వీడియోల నిర్మాణానికే ఖర్చు చేస్తూ, కంటెంట్ నాణ్యతను పెంచుకుంటూ వెళ్లారు. యూట్యూబ్ ద్వారానే కాకుండా, "బీస్ట్ బర్గర్" అనే ఫాస్ట్ ఫుడ్ చైన్, "ఫీస్టబుల్స్" అనే చాక్లెట్ కంపెనీ వంటి విజయవంతమైన వ్యాపారాలను కూడా మిస్టర్‌బీస్ట్ నిర్వహిస్తున్నారు.
రికార్డు..
మరోవైపు జూన్ 2024 నాటికి, యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన వ్యక్తిగా కూడా మిస్టర్ బీస్ట్ రికార్డు సృష్టించారు. సంపాదనతో పాటు దాతృత్వంలోనూ మిస్టర్ బీస్ట్ ముందుంటారు. "బీస్ట్ ఫిలాంత్రోపీ" పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేల మందికి కంటి చూపునివ్వడం, లక్షల మొక్కలు నాటించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చనిపోయే లోపు తన దగ్గరున్న ప్రతీ పైసా దానం చేస్తానని మిస్టర్ బీస్ట్ గతంలోనే ప్రకటించారు. తన జీవిత లక్ష్యం బాగా డబ్బు సంపాదించి.. ఆ డబ్బును మంచి పనుల కోసం ఖర్చు చేయడమేనని ఆయన పలు సందర్భాల్లో తెలిపారు.
-
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
ఈ అడవిలోని చెట్ల మధ్య దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications