వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెలెన్‌స్కీ వెనుకడుగు - యుద్దం అంతానికి రాజీకి సిద్దం : ‘నాటో’లో చేరే ఆలోచన లేదిక..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సంచలన ప్రతిపాదన చేసారు. ఇప్పటి వరకు రష్యాకు లొంగేదీ లేదు.. పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసిన ఆయన ఆకస్మికంగా తన రూటు మార్చారు. తన అభ్యర్ధనలను పట్టించుకోని నాటో కూటమి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. రష్యా యుద్దానికి ముందు పెట్టిన రెండు కండీషన్ల పైన ఇప్పుడు సానుకూలంగా స్పందించారు. ఒక విధంగా రష్యా యుద్దం ఆపే విధంగా ప్రతిపాదన చేసారు. రష్యా చేసిన మరో కీలక డిమాండ్‌పైనా 'రాజీ'కి సిద్ధమని స్పష్టం చేశారు. ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేసారు.

Recommended Video

Russia Ukraine Conflict : I'm Not Hiding In A Bunker Like Putin - Zelenskyy | Oneindia Telugu
జెలెన్ స్కీ కీలక ప్రకటన

జెలెన్ స్కీ కీలక ప్రకటన

‘నాటో'లో చేరే ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. నాటోపై జెలెన్‌స్కీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోవియట్‌ నుంచి విడిపోయిన దేశాల మధ్య నాటో చిచ్చు పెట్టిందని విమర్శించారు. నాటోలో చేరుతామని తాము ఇప్పటి వరకు అడుగుతూ వచ్చామన్నారు. మోకాళ్ల మీద నిలబడి ప్రాధేయపడాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నాటోలో చేరేదే లేదని తేల్చి చెప్పారు. దీంతో..రష్యా తొలి నుంచి చేస్తున్న డిమాండ్ పరిష్కారం దిశగా జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేయటంతో ఇప్పుడు యుద్దం ఆగుతుందా అనే చర్చ మొదలైంది. రష్యా అసలు ఉక్రెయిన్ పైన సైనిక చర్చ ప్రారంభించే ముందు ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్‌, లుగాన్స్క్‌ రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. దాంతో.. ఉక్రెయిన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నాటో కూటమి పైన అసహనం.. చేరబోమని స్పష్టీకరణ

నాటో కూటమి పైన అసహనం.. చేరబోమని స్పష్టీకరణ

రష్యా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. ఇక, ఇప్పుడు 13 రోజుల యుద్దం తరువాత జెలెన్‌స్కీ ఆ రెండు రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించేందుకు ‘రాజీ' పడేందుకు సిద్ధమని ప్రకటించారు. అదే సమయంలో ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఉక్రెయిన్ మద్దతు దారుల పరిస్థితి ఏంటనే చర్చ జరగాలని ప్రతిపాదించారు. అసలు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పైన సైనిక చర్చ ప్రకటన సమయంలో కీలకంగా ఇవే అంశాలను ప్రస్తావించారు. పుతిన్ చేసిన డిమాండ్లలో భాగం..కీలకమైన నాటోకు దూరంగా ఉండడం, రెండు రాష్ట్రాలను స్వతంత్రంగా గుర్తించడం వరకే జెలెన్‌స్కీ తాజాగా హామీ ఇచ్చారు. అయితే.. పూర్తిస్థాయిలో ఉక్రెయిన్‌ను మిలటరీ రహిత దేశంగా ప్రకటించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది. దానికి తోడు క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా గుర్తించాలని చెబుతోంది. ఈ రెండు డిమాండ్లకూ జెలెన్‌స్కీ అంగీకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

యుద్దం ఆగేనా.. పుతిన్ నిర్ణయం కోసం

యుద్దం ఆగేనా.. పుతిన్ నిర్ణయం కోసం

ఒకప్పుడు ఉక్రెయిన్ పైన ఒత్తిడి పెంచుతున్న రష్యా ప్రస్తుతం జెలెన్‌స్కీ రెండు కీలక నిర్ణయాలతో ముందుకు రావటంతో.. యుద్దం ఆపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, మిగిలిన డిమాండ్లు అందునా ప్రధానంగా క్రిమియాను వదులుకోవటం పైనా జెలెన్‌స్కీ నిర్ణయం తీసుకున్న తరువాతనే పూర్తి స్థాయిలో రష్యా వెనక్కు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక, జెలెన్‌స్కీ తాజా ప్రకటనతో యుద్దం కొనసాగింపు పైన పుతిన్ నిర్ణయం కీలకం కానుంది. అంతర్జాతీయ సమాజంతో పాటుగా యూరోపియన్ దేశాలు సైతం తమ దేశం పైన రష్యా దురాక్రమణ చేస్తున్నాయంటూ ఆంక్షలను విధించటం మినహా.. యుద్దాన్ని నిరోధించలేకపోవటంతో ఇప్పుడు జెలెన్‌స్కీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

English summary
Ukriane agrees to give away the two disputed regions to Russia and says that it would not join NATO, technically putting an end to war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X