వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: 2016 మళ్ళీ రిపీట్ అవుతుంది : వార్నర్ జోస్యం

|
Google Oneindia TeluguNews

షార్జా: 2016లో టైటిల్‌ గెలుపొందిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఈ సీజన్‌లోనూ అలాంటి ఫలితాలే సాధిస్తుందని ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పుడు చివరి మూడు మ్యాచ్‌లు గెలవాల్సి రావడంతో గెలిచి సాధించామని, ఇప్పుడు కూడా మరో మ్యాచ్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో‌ ఎస్‌ఆర్‌హెచ్‌ అదరగొట్టింది. తొలుత బంతితో, తర్వాత బ్యాటుతో ఆధిపత్యం చెలాయించి.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏడు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది.

మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ... 'బెంగళూరు, ముంబై రూపంలో వరుసగా రెండు పటిష్ట జట్లను మేము ఓడించాల్సి ఉందని తెలుసు. ఇంకా ఒక మ్యాచ్ ఉంది. మ్యాచ్‌కు ముందు విజయ్‌ శంకర్‌ను కోల్పోవడం పెద్దలోటు. టాప్ ఆర్డర్‌లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. అయితే అవి బాగా కలిసొచ్చాయి. ఈ రోజు మా బౌలర్లు అద్భుతంగా బంతులేశారు. నటరాజన్, సందీప్, హోల్డర్, రషీద్ బాగా ఆడారు. ఈ విజయం వారిదే' అని అన్నాడు.

IPL 2020: 2016 scenario will repeat this time , predicts SRH skipper David Warner

'మేం సరైన జట్టుతో కచ్చితమైన భాగస్వామ్యాలు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాం. చివరకు ఓ మార్గం కనుకొన్నాం. 4 ఓవర్లలో 20 కన్నా తక్కువ పరుగులు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వికెట్‌ మందకొడిగా మారుతుండడంతో బౌలర్లు అందుకు అనుగుణంగా బంతులు వేయాలి. దుబాయ్‌లో తేమ ప్రభావం ఉంది. జాసన్ హోల్డర్‌ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌. అతడికి బౌన్స్‌ వేయాలంటే కాస్త ఆలోచించాలి. హోల్డర్ నిలకడగా రాణించడం గొప్ప విశేషం' అని డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసించాడు.

'ఈరోజు తప్పక గెలవాలని మాకు తెలుసు. ముంబైతో జరిగే తదుపరి మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంది. మాకు 2016లోనూ ఇలాగే జరిగింది. చివరి మూడు మ్యాచ్‌లు గెలవాల్సి రావడంతో గెలిచి సాధించాం. ఇప్పుడు కూడా గెలుస్తాం' అని ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ 6 విజయాలతో 12 పాయింట్లు సాధించగా.. పంజాబ్‌, రాజస్థాన్‌, కోల్‌కతా సైతం అన్నే పాయింట్లతో కొనసాగుతున్నాయి.

English summary
IPL 2020, RCB vs SRH: Sunrisers Hyderabad captain David Warner says The wicket is slowing up a bit, the bowlers got to adapt to it. Tonight the bowlers have executed it well. Dubai has been the same, I think it gets dewy here. It wasn't a surprise at all. Holder's a great all-rounder. To bowl a bouncer against someone like him, you have to dig it very short. It's great to have that consistency. We knew we had to win today, and that's the case in the next game. In 2016 we had to win three games and we did that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X