Qualifier 2:SRHతో ఆడాలంటే భయం వీడాలి: మార్కస్ స్టాయినిస్

అబుదాబి: ఐపీఎల్‌ 2020 క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్..‌ ఫైనల్‌ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్‌-1లో ముంబై ఇండియన్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ.. బలంగా పుంజుకొని తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో సంచలన విజయాలు నమోదు చేసిన వార్నర్‌సేన ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. మరోవైపు చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలతో ఢీలాపడిన ఢిల్లీ ఒత్తిడిని జయించి సమిష్టిగా రాణించాలనుకుంటోంది.

ఐపీఎల్ 2020‌లో వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ని ఓడించాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా చెలరేగిపోలని ఆ జట్టు ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ సహచరులకి సూచించాడు. క్వాలిఫయర్‌-2లో ఇదే ప్రణాళిక అని చెప్పకనే చెప్పాడు. 'ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ. 13వ సీజన్‌లో చాలా జట్లు ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాయి. ఢిల్లీ కూడా టోర్నీని మెరుగ్గా ఆరంభించినా.. ఆ తర్వాత తడబడింది. అయినా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కి వచ్చాం. ఇప్పుడు ఫైనల్‌కి చేరాలంటే ఒక విజయం కావాలి' అని స్టాయినిస్ పేర్కొన్నాడు.

IPL 2020: Fear should be kept away while playing SRH,says Stoinis

క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ని ఓడించాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా చెలరేగిపోలని మార్కస్ స్టాయినిస్ పేర్కొన్నాడు. 'టోర్నీలో గత పరాజయాల్ని మరిచిపోవాల్సిన సమయం ఇది. కీలక మ్యాచ్ ముందుంది. హైదరాబాద్‌పై మ్యాచ్‌లో భయం లేకుండా స్వేచ్ఛగా మా జట్టు ఆడాలి. అప్పుడే హైదరాబాద్‌ని ఓడించగలం. ఫైనల్‌కి చేరేందు గొప్ప అవకాశం మా ముందు ఉంది' అని స్టాయినిస్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫైనల్లో అడుగుపెట్టలేదు. ఉత్కంఠ పోరాటాల్లో తేలిపోయే ఢిల్లీ.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏడు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆడి అందులో ఆరింట ఓడింది. ఆ గెలిచిన ఒక్కటి హైదరాబాద్‌పైనే కావడం క్యాపిటల్స్‌కు ఊరటనిచ్చే అంశం. దేశీ బాయ్స్‌తో కళకళలాడుతున్న ఢిల్లీ గత ఆరు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తప్పిదాలను సరిదిద్దుకొని సమిష్టిగా సత్తాచాటితేనే ఫైనల్‌ కోరిక తీరుతుంది.

ఈ సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌పైనే ఢిల్లీ ఎక్కువగా ఆధారపడుతున్నది. గత మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్‌, రిషబ్ పంత్‌ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నది. ముఖ్యంగా స్టొయినిస్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్‌లోనే అత్యంత వేగంగా బంతులు విసురుతున్న అన్రిచ్ నోర్జే, కాగిసో రబాడ నిలకడగా రాణిస్తున్నా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించలేకపోతున్నారు. వీరు రాణిస్తే ఢిల్లీకి విజయం సులువే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+