• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IPL 2020: తొలివారం ముగిసింది.. ప్రత్యర్థులకు వార్నింగ్ పంపిన ఢిల్లీ, పంజాబ్ జట్లు

|

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది ప్రారంభమైంది. సెప్టెంబర్ 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ గేమ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఒక వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారంలో ఏడు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ వారం రోజులు జరిగిన మ్యాచ్‌లో కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి. అదే సమయంలో ఒక మ్యాచ్‌లో సూపర్ ఓవర్ కూడా జరిగింది. మొత్తానికి ఐపీఎల్ పై క్రియేట్ అయిన హైప్ నిజంగా ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ వారంలో జరిగిన మ్యాచ్‌లు చోటుచేసుకున్న పరిణామాలు బలబలాలు, ఇతరత్ర అంశాలపై ఓ లుక్కేద్దాం.

ఐపీఎల్ 2020లో ఢిల్లీ జట్టు డామినేట్ చేస్తుందా

ఐపీఎల్ 2020లో ఢిల్లీ జట్టు డామినేట్ చేస్తుందా

ఐపీఎల్ 2020 సీజన్‌లో అప్పుడే వారం రోజులు గడిచాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఈ లీగ్‌లో ఎన్నో మెరుపులు మరన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కటే రెండు విజయాలను నమోదు చేసిన జట్టుగా నిలిచింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైన ఫామ్ కొనసాగిస్తుండటంతో ఆ జట్టును ఏదో తెలియని ఆందోళన ఆవరించింది. ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో తొలిస్థానంలో ఉంది. ఇలానే టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్స్‌గా నిలుస్తుంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో సూపర్ ఓవర్ విక్టరీతో టోర్నీని ప్రారంభించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. వారిలో మార్కస్ స్టోయినిసస్ ఒకరు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరోవైపు పృథ్వీ షా కూడా ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. ఇక రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు కాస్త కుదురుకున్నారంటే ఢిల్లీ దుర్భేధ్యంగా మారుతుందని చెప్పడంలో అనుమానం లేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ను తన బౌలింగ్‌తో ముప్పు తిప్పలు పెట్టిన స్పీడ్‌స్టర్ అన్రిచ్ నోర్టే ఢిల్లీకి అదనపు బలం. బౌలింగ్ విభాగంలో గాయాలతో దూరమైన అశ్విన్, ఇశాంత్ శర్మలు లేకపోయినప్పటికీ ఢిల్లీ చెప్పుకోదగ్గ విజయాలు నమోదు చేసింది.

కేఎల్ రాహుల్ తన జట్టును విజయతీరాలకు చేర్చగలడా..?

కేఎల్ రాహుల్ తన జట్టును విజయతీరాలకు చేర్చగలడా..?

ఇక ఐపీఎల్‌లో మాట్లాడుకోవాల్సిన రెండో జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు.ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తృటిలో గేమ్ కోల్పోయిన పంజాబ్ జట్టు ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన బ్యాటింగ్‌తో ఊచకోత కోశాడు. 69 బంతుల్లో 132 పరుగులు చేసి పలు రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక ఈ జట్టులో మయాంక్ అగర్వాల్ కూడా ఫామ్‌లో ఉండటంతో పాటు గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా దూకుడుగా ఆడగలిగే సామర్థ్యం ఉండటంతో బ్యాటింగ్ విభాగంలో పంజాబ్ జట్టు స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో కూడా పంజాబ్ ఫర్వాలేదనిపిస్తోంది. మొహమ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్‌, నాణ్యమైన స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌లతో బౌలింగ్ యూనిట్ బాగానే ఉంది. ఈ వారంలో ఢిల్లీతో ఓడిపోయిన పంజాబ్ ఆర్‌సీబీపై 97 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్ పూర్తి స్థాయిలో సత్తా చాటడం లేదా..?

ముంబై ఇండియన్స్ పూర్తి స్థాయిలో సత్తా చాటడం లేదా..?

ఇక ముంబై ఇండియన్స్ ఈ సారి పేపర్‌పై చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. రోహిత్ శర్మ తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ ఆ తర్వాత కోల్‌కతా మ్యాచ్‌లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్‌లు బ్యాటింగ్‌లో చెలరేగిపోవడంతో విక్టరీ నమోదు చేసింది. ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో దూరమైన బుమ్రా.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటి రెండు ప్రధాన వికెట్లు మోర్గాన్, రస్సెల్ వికెట్లు తీశాడు. అయితే ఇప్పుడు రానున్న వారంలో ఆర్‌సీబీ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో ఆడబోయే రెండు మ్యాచుల్లో సత్తా చాటితే తిరిగి రేస్‌లో నిలవగలదు.

 రాజస్థాన్ రాయల్స్ ఇలానే ఆడితే పోటీలో నిలబడే అవకాశం

రాజస్థాన్ రాయల్స్ ఇలానే ఆడితే పోటీలో నిలబడే అవకాశం

రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌లో సత్తాచాటినప్పటికీ బెన్ స్టోక్స్ లేకుండా ఆ జట్టు కాస్త వెలితితో కనిపిస్తోంది. అయితే స్టీవ్ స్మిత్ జట్టు మాత్రం ఆ వెలితి లేకుండా చేసే ప్రయత్నం చేసింది. సంజు శాంసన్ బ్యాట్‌తో వీరవిహారం చేయడంతో ఆ జట్టులో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆపై కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా మంచి ఫామ్‌లో ఉండటం ఈ జట్టుకు కలిసొచ్చే అంశాలని చెప్పాలి. ఇక చివరిలో జోఫ్రా ఆర్చర్ కూడా మెరుపులు మెరిపిస్తుండటం ఈ జట్టుకు అదనపు బలమనే చెప్పాలి. అంతేకాదు మిడిల్ ఆర్డర్ కూడా కాస్త మంచి ప్రదర్శన ఇస్తే రాజస్థాన్ రాయల్స్‌ను అడ్డుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. ఆడిన ఒకే మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 16 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది.

అంబటి రాయుడు లేకపోవడం చెన్నైకి శాపమేనా..?

అంబటి రాయుడు లేకపోవడం చెన్నైకి శాపమేనా..?

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఏమైనా జరిగే అవకాశం ఉంది. రెండు మ్యాచ్‌లు ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గాయం కారణంగా అంబటి రాయుడు లేకపోవడంతో ఆ జట్టు టాప్ ఆర్డర్‌ను వేధిస్తోంది. అయితే షేన్ వాట్సన్, మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఉన్నప్పటికీ వారు మంచి స్టార్ట్ ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో సరైన తురుపు ముక్కులు లేకపోవడం ధోనీని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక ధోనీ బ్యాటింగ్ ఫామ్ పై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతుండగా బ్యాటింగ్ ఆర్డర్ పై కూడా స్పష్టత లేదు. ఒకప్పుడు చెన్నై జట్టుకు స్పిన్ బౌలింగ్ ప్రధాన అస్త్రంగా ఉండగా ఇప్పుడు అదే అతిపెద్ద సమస్యగా జట్టులో కనిపిస్తోంది. ఇక ఆడిన మూడు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ పై ఐదు వికెట్ల తేదడాతో విజయం సాధించగా రాజస్తాన్ రాయల్స్ పై 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌పై 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.

బెంగళూరును వీడని కష్టాలు

బెంగళూరును వీడని కష్టాలు

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాదుపై గెలిచి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో 97 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. విరాట్ జట్టులో దేవ్‌దత్ పడిక్కల్ హైదరాబాదుతో జరిగిన మ్యాచ్‌లో మెరిసినప్పటికీ ఆ తర్వాత పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రాణించలేదు. ఇక బౌలింగ్ విభాగంలో డేల్ స్టెయిన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు ఇవ్వడం ఈ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

హైదరాబాద్ జట్టుకు మిడిల్ ఆర్డర్‌ ప్రధాన సమస్య

హైదరాబాద్ జట్టుకు మిడిల్ ఆర్డర్‌ ప్రధాన సమస్య

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికొస్తే తొలివారంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మాత్రమే ఆడింది. వార్నర్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ ఇబ్బందికరంగా మారింది. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేసుకుని ఓడిపోయారు. బెయిర్‌స్టో ఔట్ అయ్యాక మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 32 పరుగుల్లో 8 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ జట్టు. ఇక సన్‌రైజర్స్ జట్టుకు ప్రధాన బలం బౌలింగ్. అయితే కేన్ విలియమ్స్ లేదా మొహ్మద్ నబీలకు తుది జట్టులో స్థానం కల్పిస్తే మిడిల్ ఆర్డర్ సమస్య కాస్తయినా తీరే అవకాశాలున్నాయి.

బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో లేకపోవడం కోల్‌కతాకు శాపం

బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో లేకపోవడం కోల్‌కతాకు శాపం

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే ఈ జట్టు ముంబై ఇండియన్స్‌తో ఈ వారంలో ఆడింది. 49 పరుగుల తేడాతో ముంబై పై ఓటమి చవిచూసింది. ఈ జట్టుకు బౌలర్ శివం మావి ప్రధాన ఆయుధం. అయితే ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించగల సత్తా ఉన్నవాడు. అయితే ఈ జట్టులో బ్యాట్స్‌మెన్‌ సరైనా ఫాం‌మ్‌లో లేకపోవడం ఈ జట్టుకు శాపంగా మారింది. వీరికి మోర్గాన్, రస్సెల్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నప్పటికీ వారు బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువన రావడంతో అప్పటికే మ్యాచ్‌లో సగానికి పైగా ఓవర్లు ముగిసిపోతున్నాయి. దీంతో వీరు మెరుపులు మెరిపించినప్పటికీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోతున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ఫామ్ కూడా ఆ జట్టును కలవరపెడుతోంది.

English summary
Delhi Capitals and Kings XI Punjab have been the most impressive teams in the opening week in the UAE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X