వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేంజరస్ బీమర్: ఒకే బౌలర్ నుంచి రెండుసార్లు: ప్రమాదకరంగా: బ్యాట్స్‌మెన్‌ కట్టడికి వ్యూహమా?

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో సరికొత్త సంప్రదాయానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరంగా భావించే బీమర్లు పడుతున్నాయి. బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తిస్తున్నాయి. పిడుగుల్లాంటి షాట్లు, భారీ సిక్సర్లతో విరుచుకుపడుతోన్న బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడానికి క్రమంగా.. బీమర్లను సంధించే ప్రయత్నాలకు బౌలర్లు దిగుతున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పైగా ఒకే బౌలర్ నుంచి రెండుసార్లు బీమర్లు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

క్వారంటైన్‌లోకి పుజారా, హనుమ విహారి: రవిశాస్త్రి సహా కోచింగ్ స్టాఫ్ మొత్తం: ఆ టూర్‌కు ముందుక్వారంటైన్‌లోకి పుజారా, హనుమ విహారి: రవిశాస్త్రి సహా కోచింగ్ స్టాఫ్ మొత్తం: ఆ టూర్‌కు ముందు

ఢిల్లీ కేపిటల్స్ బ్యాట్స్‌మెన్‌పై..

ఢిల్లీ కేపిటల్స్ బ్యాట్స్‌మెన్‌పై..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో బీమర్ పడింది. రాయల్ ఛాలెంజర్స్ పేసర్ నవదీప్ షైనీ దీన్ని సంధించాడు. ఢిల్లీ కేపిటల్స్ ఆల్‌రౌండర్, పించ్ హిట్టర్‌ మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్‌లో చెలరేగిపోతోన్న సమయంలో అతను బీమర్‌ను ఎదుర్కొన్నాడు. ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్ 15వ ఓవర్‌ను షైనీ వేశాడు. ఈ ఓవర్ మూడో బంతిని సిక్స్‌గా, నాలుగో బంతిని ఫోర్‌గా మలిచాడు స్టోయినిస్. దీనితో షైనీ రిథమ్ దెబ్బతిన్నట్టయింది. అయిదో బంతిని హై ఫుల్‌టాస్‌గా సంధించాడు. స్టోయినిస్ ఆ బీమర్‌‌ను అడ్డుకోగలిగాడు. ఈ క్రమంలో అతని వేలిని బలంగా తాకిందా బీమర్. దీనితో కొద్దిసేపు నొప్పితో ఇబ్బంది పడ్డాడు స్టోయినిస్. ఫిజియోను పిలిపించుకుని, ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు.

 కుప్పకూలిన రాహుల్ తెవాటియా..

కుప్పకూలిన రాహుల్ తెవాటియా..

నవదీప్ షైనీ బీమర్‌ను సంధించడం ఇది రెండోసారి. ఇంతకుముందు- రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాకు బీమర్‌ను విసిరాడతను. ఆ బాల్ కాస్త నేరుగా తన ఛాతీకి తగలడంతో తెవాటియా క్రీజులో కుప్పకూలిన విషయం తెలిసిందే. అదృష్టం బాగుండి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. షైనీ విసిరిన డేంజరస్ బీమర్.. నేరుగా తెవాటియా చాతికి తగిలింది. దాని ధాటికి అతను క్రీజులో కూలిపోయాడు. ఆ వెంటనే మరో మ్యాచ్‌లో షైనీ బీమర్‌ను వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 బీమర్లను సంధించడం కొత్తేమీ కాదు గానీ..

బీమర్లను సంధించడం కొత్తేమీ కాదు గానీ..

బౌలర్లు బీమర్లను సంధించడం కొత్తేమీ కాదు. భారీ షాట్లతో విరుచుకుపడే బ్యాట్స్‌మెన్లను నియంత్రించడానికి బౌలర్లు బీమర్లను వేస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లల్లో సచిన్ టెండుల్కర్.. ఇలాంటి బీమర్లను అత్యధికసార్లు ఎదుర్కొన్నాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. ఆసీస్ పేస్ బౌలర్ గిలెస్పీ.. వేర్వేరు మ్యాచ్‌లల్లో ఏకంగా ఆరుసార్లు సచిన్‌పై బీమర్లు సంధించాడట. ఆసీస్ యంగ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ హ్యూజ్ మరణం అనంతరం.. బీమర్లు సంధించడాన్ని బౌలర్లు తగ్గించారు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్‌లో తోటి క్రికెటర్ అబాట్ వేసిన ఓ బీమర్‌కు హ్యూజ్ కన్నుమూశాడు. క్రీజ్‌లో కుప్పకూలిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

English summary
Royal Challengers Bangalore pacer Navdeep Saini bowled yet another beamer in the ongoing IPL 2020 with Delhi Capitals’ Marcus Stoinis being in the firing line this time. The right-arm pacer had previously bowled such a delivery to Rahul Tewatia too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X