• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

RCB vs KKR:కోల్‌కతాను కోహ్లీ కుమ్మేస్తాడా..దినేష్ వ్యూహమేంటి...? రెండు జట్ల బలాలు బలహీనతలు!

|

షార్జా: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగవ స్థానంలో ఉండగా బెంగళూరు జట్టు ఐదవ స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు షార్జా వేదిక కానుంది. షార్జా స్టేడియం చిన్నది కావటంతో సిక్సుల వరద అభిమానులకు కనువిందు చేయనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచిన ఉత్సాహంతో ఆర్‌సీబీ బరిలోకి దిగుతుండగా.. కింగ్స్ పంజాబ్‌తో స్పూర్తిదాయకమైన విజయాన్నందుకున్న కేకేఆర్ అదే జోరు కొనసాగించాలనుకుంటుంది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. బలబలాల పరంగా పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. మరీ ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి

ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ

ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన మార్క్ పెర్ఫామెన్స్ జట్టుకు అద్భుత విజయాన్నందుకున్నాడు. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్‌తో టచ్‌లోకి వచ్చి కోహ్లీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ రాణించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ మరో క్లాస్ ఇన్నింగ్స్ ఆడితే కోల్‌కతాకు కష్టాలు తప్పవు.మరోవైపు యువ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ ఫర్వాలేదనిపిస్తున్నా.. ఫించ్ విఫలమవుతున్నాడు. ఇది ఆర్‌సీబీకి సమస్యగా మారింది. మంచి ఆరంభం ఇవ్వాల్సిన బాధ్యత ఫించ్‌పై ఉంది.

డెవీలియర్స్ రెచ్చిపోతే....

డెవీలియర్స్ రెచ్చిపోతే....

ఇక ఆరంభంలో అదరగొట్టిన డివిలియర్స్.. గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అతను తన మార్క్ పర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంది. వీరీలో ఏ ఇద్దురు చెలరేగినా ఆర్‌సీబీ బ్యాటింగ్‌కు డోకా ఉండదు.ఇక క్రిస్ మోర్రిస్ రాకతో అటు బ్యాటింగ్ డెప్త్‌తో పాటు ఇటు బౌలింగ్ విభాగం పటిష్టమైంది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతను మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అతనికి అండగా ఇసురు ఉడానా, నవదీప్ సైనీ రాణిస్తున్నారు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లకు తిరుగులేదు. జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఆర్‌సీబీ ఖాతాలో మరో విజయం చేరడం ఖాయాం.

పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్‌రైడర్స్ టోర్నీ ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ... ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో పుంజుకుంది. ఇతర జట్లకు బలమైన పోటీని ఇస్తోంది. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమి నుంచి విజయాన్నందుకుంది. ఆల్‌రౌండ్ షోతో అద్భుత విజయాన్నందుకుంది. ఇన్నాళ్లు విఫలమైన కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా టచ్‌లోకి వచ్చాడు. దీంతో ఆ జట్టు బలం రెట్టింపు అయింది. అయితే ఆండ్రూ రస్సెల్ గాయపడటం.. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు వ్యక్తమవ్వడం ఆ జట్టును కొంత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

 సునీల్ నరైన్ ఆడుతాడా..?

సునీల్ నరైన్ ఆడుతాడా..?

రిస్క్ వద్దనుకుంటే మాత్రం రస్సెల్ స్థానంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం టామ్ బాంటన్ అరంగేట్రం చేయవచ్చు. అలాగే నరైన్‌కు ప్రత్యామ్నాయంగా క్రిస్ గ్రీన్ సిద్దం చేసుకోవాలనుకుంటే మిస్టర్ స్పిన్నర్ బెంచ్‌కు పరిమితం కావచ్చు.శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి ఫామ్‌లో ఉన్నారు. వీరు మరోసారి చెలరేగితే కేకేఆర్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఇక కమిన్స్, నాగర్ కోటి, శివమ్ మావి, వరుణ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. మార్పులు చేయాలనుకుంటే నాగర్ కోటీ స్థానంలో శివమ్ మావికి అవకాశం దక్కవచ్చు.

English summary
As the part of IPL 2020 It is Royal Challengers Bangalore who will be taking on Kolkata Night riders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X