వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెహ్వాగ్ బెస్ట్ ఐపీఎల్ టీమ్.. వార్నర్‌కు ఐదో స్థానం.. కెప్టెన్ రోహిత్ కాదు!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి మెగా టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఐపీఎల్ 2020 ముగిసిన నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన డ్రీమ్ జట్టును ప్రకటించాడు. ఈ సీజన్లో ఎనమిది జట్ల క్రికెటర్ల ఆటతీరు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసినట్టు సెహ్వాగ్ తెలిపాడు. దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే.

వీరేంద్ర సెహ్వాగ్ తన డ్రీమ్ జట్టు ఓపెనర్లుగా సీనియర్ ఆటగాళ్లను ఎవరినీ ఎంచుకోలేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్‌ను ఓపెనర్లుగా ఎంపిక చేసుకున్నాడు. 670 రన్స్‌తో రాహుల్ ఆరెంజ్ క్యాప్ సాధించగా.. తొలిసారి ఐపీఎల్ ఆడిన పడిక్కల్ 450కిపైగా రన్స్‌తో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికయిన విషయం తెలిసిందే. అందుకే వీరూ ఈ ఇద్దరికీ ఓటేశాడు.

IPL 2020: This is Virendra Sehwags best IPL XI,Kohli chosen as captain

మూడో స్థానంలో ముంబై ఇండియన్స్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ ఎంపిక చేశాడు. సూర్యకుమార్ గత మూడు సీజన్లుగా నిలకడగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసీజన్లో కూడా పరుగుల వరద పారించాడు. నాలుగో స్థానం కోసం విరాట్ కోహ్లీని ఎంచుకున్న సెహ్వాగ్.. ఐదో స్థానంలో డేవిడ్ వార్నర్‌ను ఎంపిక చేసుకున్నాడు. కోహ్లీ, వార్నర్‌లలో కెప్టెన్‌గా ఎవర్ని ఎంపిక చేయాలనే విషయంలో కొంత అయోమయానికి గురైనప్పటికీ.. విరాట్ ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లోనూ ఆడగలడనే కారణంతో అతడి వైపే మొగ్గు చూపినట్లు తెలిపాడు. ఆరోస్థానంలో ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. హార్డ్ హిట్టర్లు కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యాలు వీరూ షాక్ ఇచ్చాడు.

పేస్ బౌలర్ల జాబితాలో కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు.. స్పిన్నర్ల కోటాలో యుజ్వేంద్ర చహల్, రషీద్ ఖాన్‌లకు వీరేంద్ర సెహ్వాగ్ తన తుది జట్టులో చోటిచ్చాడు. 12వ ఆటగాడిగా ఇషాన్ కిషన్‌, 13వ ఆటగాడిగా జోఫ్రా ఆర్చర్‌ను వీరూ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన ఆర్చర్‌కు 13వ ప్లేయర్‌గా చోటు దక్కగా.. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల నుంచి ఒక్కరికి కూడా వీరూ ఎంచుకోలేదు.

కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌, ఏబీ డివిలియర్స్‌, కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చహల్, రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్ (12వ ఆటగాడు)‌, జోఫ్రా ఆర్చర్ (13వ ఆటగాడు).

English summary
IPL 2020: Former India batsman Virender Sehwag picks his IPL XI, Sehwag chooses Virat Kohli as captain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X