• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధోనీ సేన ప్రతాపం అంతా ఒక్క మ్యాచ్‌కే ఆవిరైందా? అతణ్ని వదిలించుకోవడమే బెటర్

|

అబుధాబి: ప్రపంచస్థాయి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ పరాజయాల బాట పట్టింది. తమ శక్తి సామర్థ్యాలన్నీ ఒక్క మ్యాచ్‌తోనే ఆవిరి అయ్యాయనే విషయాన్ని స్పష్టం చేసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై సాగిన మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చివేసిన తరువాత చెన్నై సూపర్ కింగ్స్ గాడిలో పడినట్టు కనిపించినప్పటికీ.. అది గాలివాటం విజయం అని నిరూపించుకుంది. కోల్‌కత నైట్ రైడర్స్ నిర్దేశించిన పరిమిత లక్ష్యాన్ని కూడా అందుకోలేక చెన్నై సింహాలు చతికిల పడ్డాయంటే ధోనీ సేన బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

167 పరుగులే అయినా..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో బుధవారం రాత్రి కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. కోల్‌కత ఉంచిన 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయింది చెన్నై. 20 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. 10 రన్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ షేన్ వాట్సన్, చివరిలో రవీంద్ర జడేజా తప్ప బ్యాటింగ్‌లో ఎవరూ రాణించలేకపోెయారు.. ధోనీ సహా.

క్రీజ్‌లో పించ్ హిట్టర్లు ఉన్నా..

నిజానికి- చెన్నై విజయాన్ని సాధించడానికి అన్ని విధాలుగా అనేక అవకాశాలు ఉన్న మ్యాచ్ ఇది. చివరి ఓవర్లలో మరింత దూకుడుగా బ్యాటింగ్ చేసి ఉండాల్సింది. పించ్ హిట్టర్లుగా పేరున్న రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ క్రీజ్‌లో ఉండగా.. గెలుపుపై ఢోకా లేదనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలంటే 21 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో కేదార్ జాదవ్ బ్యాటింగ్‌కు దిగాడు. ధనాధన్ క్రికెట్‌లో 21 బంతుల్లో 39 పరుగులు చేయడం మంచినీళ్లు తాగినంత సులభం. ఒకవంక కేదార్.. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా ఉండటం వల్ల గెలుపు ఖాయమేననిపించింది సగటు అభిమానికి.

కేదార్ వైఫల్యంతో..

సరిగ్గా ఇక్కడే కేదార్ జాదవ్ విఫలం అయ్యాడు. నింపాదిగా ఆడాడు. ఓటమిని అంగీకరించినట్టుగా అతని బ్యాటింగ్ శైలి కొనసాగింది. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా భారీ షాట్లు ఆడుతున్నప్పటికీ.. కేదార్ మాత్రం క్రీజులో చురుగ్గా కదల్లేకపోయాడు. ఎనిమిది బంతులనే ఎదుర్కొన్న జడేజా.. ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 21 పరుగులు చేశాడు. 12 బంతులను ఎదుర్కొన్న ఏడు పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్ ఉంది. గెలుపునకు, ఓటమికి ఉన్న వ్యత్యాసం.. 10 పరుగులు. కేదార్ జాదవ్ ఏ మాత్రం ధాటిగా ఆడి ఉన్నా ఈ 10 పరుగులను సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోయి ఉండొచ్చు.

బాధ్యుడు కేదార్ ఒక్కడేనా?

చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఓడిపోవడానికి కేదార్ జాదవ్‌ను ఒక్కడినే తప్పు పట్టలేని పరిస్థితి నెలకొంది. డుఫ్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ.. ధాటిగా ఆడలేకపోయారు. షేన్ వాట్సన్‌కు సరైన సపోర్ట్ లేకుండా పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అంబటి రాయుడు వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌, గాయం తరువాత ఆడిన అన్నింట్లోనూ రాణించలేకపోతున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ పరిస్థితి దాదాపు ఇంతే. గుడ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ మేజిక్ ఏమైందనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్.. టోర్నమెంట్‌లో ముందుకెళ్లే అవకాశాలను మరింత క్లిష్టతరం అయ్యాయి.

English summary
A crucial decision that the CSK took on Wednesday was to send Kedar Jadhav ahead of other power-hitters like Dwayne Bravo and Ravindra Jadeja. Kedar Jadhav was brought in to bat when CSK needed 39 off 21 balls. This led to criticism on social media on the decision to send Jadhav ahead of Bravo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X