SRH అభిమానులకు గుడ్ న్యూస్: జట్టులోకి జేసన్ రాయ్.. ఇక పరుగుల వరదే..!
హైదరాబాద్ : వరుసగా రెండు ఓటమిలతో డీలా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టుకు ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ రూపంలో బలం చేకూరింది. వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమైన మిచెల్ మార్ష్ స్థానంలో హైదరాబాద్ జట్టులోకి జేసన్ రాయ్ ఎంట్రీ ఇచ్చాడు. వారంరోజుల క్రితం భారత్‌కు చేరుకున్న జేసన్ రాయ్ కరోనా నిబంధనలు పాటించాల్సి ఉన్నందున క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇప్పుడు క్వారంటైన్ ముగియడంతో జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఆ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది.
Look who just finished his quarantine.
— SunRisers Hyderabad (@SunRisers) April 16, 2021
Say hello to @JasonRoy20 👋#OrangeOrNothing #OrangeArmy #IPL2021 pic.twitter.com/9ywQimjbzk
శనివారం రోజున సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టు బలోపేతమైన ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచులు ఓడిపోయిన సన్‌రైజర్స్ జట్టు.. మూడో మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఇక జట్టులో జేసన్ రాయ్ చేరికతో హైదరాబాదుకు బలం చేకూరినట్లయ్యింది. ఇక సన్‌రైజర్స్ పోస్టు చేసిన వీడియోలో జేసన్ రాయ్ తన అనుభవం, తన అంచనాలను సన్‌రైజర్స్ అభిమానులతో పంచుకున్నాడు. గత మార్చి నెలలో భారత్‌లో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టులో జేసన్ రాయ్ చివరిసారిగా ఆడాడు.

ఇక క్వారంటైన్ పూర్తిచేసుకున్నందున జట్టులో చేరడం ఖాయమైంది. అయితే ఒకవేళ తుది జట్టులో స్థానం దక్కితే మాత్రం ఓపెనింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఇంగ్లాండ్ తరపున జేసన్ రాయ్ ఓపెనర్‌గా బరిలో దిగుతాడు. ఇప్పటికే జానీ బెయిర్ స్టో మరియు డేవిడ్ వార్నర్‌లు ఉన్నందున జేసన్ రాయ్‌కు ఓపెనింగ్ చేసే అవకాశం దక్కకపోవచ్చు. ఇక స్క్వాడ్‌లో ఉంటూ ఇప్పటికే బెంచ్‌కు పరిమితమైన కివీస్ ఆటగాడు కేన్ విలయమ్సన్‌ను ఉన్నందున.. జేసన్ రాయ్‌కు జట్టులో చోటు దక్కడంపై కూడా కొన్ని అనుమానాలున్నాయి.
గాయం నుంచి కోలుకుని ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టులో చేరి 2019 ప్రపంచకప్ ఇంగ్లాండ్ గెలవడంలో జేసన్ రాయ్ కీలక పాత్ర పోషించాడు. టాప్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే జేసన్ రాయ్ ఇంగ్లాండ్‌కు పలు విజయాలను అందించాడు. అలానే వరల్డ్ కప్‌ను కూడా ఇంగ్లాండ్ జట్టు గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక రెండు ఓటములతో కృంగిపోయి ఉన్న సన్‌రైజర్స్ జట్టులో చోటు దక్కించుకుని టాప్ ఆర్డర్‌లో మాంచి జోష్ నింపుతాడో లేదో తెలియాలంటే ముంబైతో మ్యాచ్ వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications