IPL 2022 Mega Auction: ధోనీ నుంచి క్రిస్ మారిస్ వరకు.. గత సీజన్లలో కాస్లీ ప్లేయర్స్ వీరే..!

మరి కొన్ని గంటల్లో ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ వేలంపాటకు సర్వం సిద్ధమైంది. ఇక ఏ ఆటగాడిని ఏ జట్టు ఎంతకు కొనుగోలు చేస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 10 జట్లు ఈ వేలంపాటలో పాల్గొంటున్నాయి. ముందుగా ఉన్న 8 జట్లకు అదనంగా అహ్మదాబాద్, లక్నో జట్లు చేరాయి. ఇక ఇప్పటికే కొన్ని జట్లు కొంతమంది ప్లేయర్స్‌ను రీటెయిన్ చేసుకోగా... మిగతా ఆటగాళ్ల కొనుగోలు కోసం పోటీపడుతున్నాయి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూస్తే... గతంలో ఏ ప్లేయర్లు ఎంత అత్యధిక ధరకు అమ్ముడుపోయారో తెలుసుకుందాం.

 గార్డెన్ సిటీలో మెగా ఆక్షన్

గార్డెన్ సిటీలో మెగా ఆక్షన్

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు బెంగళూరు నగరం సిద్ధమైంది. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని జట్ల యాజమాన్యాలు ఇప్పటికే గార్డెన్ సిటీకి చేరుకున్నాయి. రెండు రోజుల పాటు పండగలా సాగే ఈ మెగా వేలంపాటలో మొత్తం 590 మంది క్రికెటర్ల భవితవ్యం తేలనుంది. ఎవరు ఎంతకు అమ్ముడుపోతారో తెలుస్తుంది. గతంలో జరిగిన ఐపీఎల్ వేలంపాట కూడా ఇంతే ఇంట్రెస్ట్‌గా మారింది.

గతంలో కొందరు ఆటగాళ్లు మైండ్ బ్లోయింగ్ ధరకు అమ్ముడుపోయారు. మరి కొందరు తూతూ మంత్రంగా అమ్ముడుపోయారు. అయితే వీరే టోర్నీలో అద్భుతాలు సృష్టించి వారి ధరను ఆటోమేటిగ్గా డిమాండ్ వచ్చేలా చేసుకున్నారు. 2008లో తొలిసారి ఆక్షన్‌లో ఎంఎస్ ధోనీని సొంతం చేసుకునేందుకు ఆయా జట్ల యాజమాన్యాలు ఓ చిన్న యుద్ధమే చేశాయి.

 గతంలో ధోనీ కోసం పోటీ

గతంలో ధోనీ కోసం పోటీ

ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా బౌలర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరిస్‌కు రూ.16.25 లక్షలు పోసి కొనుగోలు చేసింది. ఇక ఇండియన్ క్రికెటర్లలో యువరాజ్ సింగ్‌ రూ. 16 కోట్లకు 2015లో అమ్ముడుపోయాడు. 2008లో ధోనీ కోసం చెన్నై మరియు ముంబై జట్లు పోటీ పడ్డాయి.

అయితే అప్పటికే సచిన్ టెండూల్కర్ ముంబైకి ఐకాన్ ప్లేయర్‌గా ఉండగా.. ధోనీని దక్కించుకోవడం ఆ జట్టుకు కష్టమైంది. దీంతో చెన్నై జట్లు ధోనీని కొనుగోలు చేసింది. ఇక 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెవిన్ పీటర్స్‌నుపై 1.55 మిలియన్ అమెరికన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాయి.

 పొలార్డ్ దిశ తిరిగింది

పొలార్డ్ దిశ తిరిగింది

2010లో మినీ వేలంపాట జరిగింది. నాడు న్యూజిలాండ్ పేసర్ షేన్‌బాండ్, అదే సమయంలో విండీస్ చిచ్చరపిడుగు కీరన్ పొలార్డ్‌లకు మంచి డిమాండ్ పలికింది. కీరన్ పొలార్డ్‌ను ముంబై ఇండియన్స్ రూ.4.8 కోట్లకు కొనుగోలు చేయగా... కోల్‌కతా నైట్ రైడర్స్ షేన్‌బాండ్‌ను కొనుగోలు చేశారు. 2011లో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.14.9 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

అదే 2012లో జరిగిన ఆక్షన్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీండ్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.12 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి చెన్నైతోనే ప్రయాణం సాగించిన జడేజాను తాజా సీజన్‌కు రూ.15 కోట్లతో చెన్నై యాజమాన్యం రీటెయిన్ చేసుకుంది.

దుమ్ములేపిన యువరాజ్

దుమ్ములేపిన యువరాజ్

2015లో యువరాజ్ సింగ్‌ను ఢిల్లీ డేర్‌ డెవిల్స్ రూ.16 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ ఏడాదికి యువరాజ్ సింగ్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. 2016లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను బెంగళూరు జట్టు రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2017లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రైజింగ్ పూణే సూపర్ జైంట్ రూ.14.5 కోట్లకు సొంతంచేసుకుంది.

2018లో ఇదే ప్లేయర్‌ను రాజస్థాన్ రూ.12.5 కోట్లకు సొంతం చేసుకుంది. 2020లో జరిగిన వేలంపాటలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పాట్ కమ్మిన్స్‌పై రూ.15.5 కోట్లు వెదజల్లింది. ఇక 2021లో సౌతాఫ్రికా స్పీడ్స్‌టర్ క్రిస్‌మోరిస్‌పై రూ.16.2 కోట్లు వెచ్చించింది రాజస్థాన్ రాయల్స్. అయితే క్రిస్ మోరిస్ ఆశించినంత స్థాయిలో రానించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+