అంబటి రాయుడు- రవీంద్ర జడేజా: కప్‌ను వారి చేతుల్లో పెట్టిన ధోనీ
అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి జెండా ఎగురవేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది. వర్షం వల్ల ఓవర్లను కుదించిన ఈ మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.. ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. అయిదోసారి టైటిల్‌ను ఎగురేసుకెళ్లింది ధోనీ సేన.
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై. గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఊహించినట్టే గుజరాత్- భారీ స్కోర్‌ను సాధించింది. ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు బ్యాటర్లు. ప్రత్యేకించి- ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అదరగొట్టాడు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని ఇవ్వగా.. మిగిలిన బ్యాటర్లు దాన్ని భారీ స్కోర్‌గా మలిచారు.

నిర్ణీత 20 ఓవర్లల్లో 214 పరుగులు చేసిందా లోకల్ టీమ్. ఈ క్రమంలో నాలుగు వికెట్లను నష్టపోయింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ విజృంభించాడీ మ్యాచ్‌లో. తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. చివరి ఓవర్‌లో 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్- 39, వృద్ధిమాన్ సాహా- 54 చేశారు. కేప్టెన్ హార్దిక్ పాండ్యా- 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు వర్షం స్వాగతం పలికింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే క్రీజ్‌లోకి దిగిన కొద్దిసేపటికే వర్షం పడింది. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ రెండు బంతులు డాట్స్‌గా పడ్డాయి. మూడో బంతిని రుతురాజ్ గైక్వాడ్ బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. దీనితో మ్యాచ్‌ను నిలిపివేశారు. పిచ్‌ను కవర్లతో కప్పివేశారు.
వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్‌ను అర్ధరాత్రి దాటిన తరువాత 12:05 నిమిషాలకు ఆరంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 15 ఓవర్ల 171 పరుగులుగా నిర్ధారించారు. బ్యాటింగ్‌కు దిగిన తరువాత చెన్నై సూపర్ కింగ్స్ వెనుదిరిగి చూసుకోలేదు. తొలి ఓవర్ నుంచే బౌలర్లపై కౌంటర్ అటాక్‌కు దిగింది. తొలి ఓవర్‌లో 10 పరుగులను రాబ్టుకుంది. అదే వేగంతో ఇన్నింగ్‌ను కొనసాగించింది.
ఏడో ఓవర్‌లో జట్టు స్కోర్ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, అదే ఓవర్‌లో డెవాన్ కాన్వే అవుట్ అయినప్పటికీ అదరలేదు.. బెదరలేదు. అజింక్య రహానె బ్యాట్ ఝుళిపించాడు. రెండు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 117 పరుగుల వద్ద రహానె అవుట్ అయ్యాడు.
అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన శివందుబేకు మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు జత కలిశాడు. స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. 13వ ఓవర్‌లో అంబటి రాయుడు మెరుపులు మెరిపించాడు. తొలి మూడు బంతులను 6,4,6గా మలిచాడు. ఎనిమిది బంతులను మాత్రమే ఎదుర్కొన్న అంబటి రాయుడు రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు చేశాడు. ఆ తరువాతి బంతికే అతను అవుట్ అయినప్పటికీ- రన్ రేట్ మాత్రం తగ్గలేదు.
అంబటి అవుట్ అయ్యే సమయానికి చెన్నైకి 14 బంతుల్లో 22 పరుగులు అవసరం. ఆ స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సిన దశలో రవీంద్ర జడేజా ఆదుకున్నాడు. చివరి రెండు బంతుల్లో 10 పరుగులను పిండుకున్నాడు.
తక్కువ పరుగులే చేసినప్పటికీ- కీలక దశలో రన్‌రేట్ తగ్గనివ్వకుండా ఆడిన అంబటి రాయుడు- రవీంద్ర జడేజాలను ధోనీ ఆకాశానికెత్తేశాడు. కప్‌ను కలెక్ట్ చేసుకున్న తరువాత దాన్ని రాయుడు-జడేజాల చేతికి అప్పగించాడు. అజింక్య రహానె అనుభవం, అంబటి రాయుడు, రవీంద్ర జడేజాల మెరుపు బ్యాటింగ్ జట్టును గెలిపించిందంటూ ప్రశంసించాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications