IPL 2023 : హార్ధిక్ పాండ్యా లక్నోను వదులుకుని గుజరాత్ కెప్టెన్ అయ్యాడా ?

ఈ ఏడాది ఐపీఎల్ లో టాప్ లో ఉన్న జట్లలో గుజరాత్ టైటాన్స్ కూడా ఒకటి. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తోంది. గుజరాత్ మ్యాచ్ లు చూస్తుంటే అందులో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఎంత కూల్ గా ఉంటున్నాడో కూడా అర్ధమవుతోంది. అలవోకగా ప్రత్యర్ధులను ఓడిస్తూ ప్లే ఆఫ్ రేసుకు గుజరాత్ దూసుకెళ్తోంది. ఇందులో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా ప్రశంసలు అందుకుంటోంది.

అయితే హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరి కెప్టెన్ కాక ముందు ఆయనకు మరో జట్టు నుంచి కూడా ఆఫర్ వచ్చిందట. అది కూడా ఆషామాషీ జట్టు కాదు. ఈ టోర్నీలో గుజరాత్ తర్వాత అత్యధిక విజయాలు నమోదు చేస్తూ నిలకడగా రాణిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. ఈ జట్టును కాదని హార్ధిక్ పాండ్యా గుజరాత్ టీమ్ తో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కెప్టెన్ గా కూడా రాణిస్తున్నాడు. ఈ విషయాన్ని హార్ధిక్ స్వయంగా వెల్లడించాడు.

 hardik

టీమిండియాలో సహచరుడైన తన ఫ్రెండ్ కేఎల్ రాహుల్ వినతి మేరకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాలని భావించిన హార్ధిక్ పాండ్యాకు గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా కెప్టెన్సీ ఆఫర్ చేసి మరీ తమ జట్టులోకి తెచ్చుకున్నాడట. దీంతో హార్ధిక్ పాండ్యా తన స్నేహితుడు కేఎల్ రాహుల్ ను కాదని మరీ కెప్టెన్సీ తీసుకుని గుజరాత్ టైటాన్స్ కు వచ్చేశాడు. ఇప్పుడు అదే లక్నోను తర్వాతి స్ధానానికి నెట్టి డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ ను జైత్రయాత్ర చేయిస్తున్నాడు.

 hardik

అయితే గతేడాది ఐపీఎల్ సమయంలోనే గుజరాత్ టైటాన్స్ కు రమ్మని కోచ్ ఆశిష్ నెహ్రా హార్ధిక్ పాండ్యాను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కానీ కెప్టెన్సీ మాత్రం ఆఫర్ చేయలేదని తెలుస్తోంది. అప్పట్లో కెప్టెన్సీ ఆఫర్ లేకపోవడంతో సాధారణ ఆటగాడిగా గుజరాత్ జట్టులో చేరేందుకు నిరాకరించిన హార్థిక్.. ఈ ఏడాది మాత్రం కెప్టెన్సీతో అరంగేట్రం చేయడమే కాకుండా ఇప్పుడు తన జట్టును మేటిగా నిలుపుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+