IPL 2023: బుమ్రాతో పాటు గాయాలతో మెగా టోర్నీకి దూరమవుతున్న స్టార్ ప్లేయర్ల జాబితా ఇదే..!
ముంబై: కొద్ది రోజుల్లో మచ్ అవెయిటెడ్ క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL2023)16వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు ఈ మెగా గేమ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా జట్లలోని ఆటగాళ్లు భారత్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు. అయితే ఈ సారి ఐపీఎల్‌లో పలు కీలక ఆటగాళ్లు స్టార్ ప్లేయర్స్ గాయాలతో టోర్నమెంట్‌కు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
మార్చి 31న జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi stadium)తలపడనుంది. ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగిన వేలంపాటలో (IPL Auction 2023) ఫ్రాంఛైజీలు ఎక్కడా తగ్గకుండా తమకు కావాల్సిన ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించి కొనుగోలు చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా శాంకరన్ నిలిచాడు. రూ.18.5 కోట్లతో శాంను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.

మరోవైపు ముంబై ఇండియన్స్ కామెరాన్ గ్రీన్‌ను రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక నికోలస్ పూరన్‌ను రూ.16 కోట్లతో లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేయగా... హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇంత భారీ ధరలతో కొనుగోలు చేసినప్పటికీ కొంతమంది ప్లేయర్లు గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడం ఫ్రాంఛైజీలను ఆందోళనకు గురి చేస్తోంది.


2023 వన్డే ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ టోర్నీకి దూరం అయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న ఈ ఫాస్ట్ బౌలర్ ముంబై ఇండియన్స్‌కు దూరం కానున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. పంత్ కూడా టోర్నీకి దూరం కానున్నాడు.

మరో వైపు కైల్ జేమీసన్ కూడా వెన్ను నొప్పి కారణంగా టోర్నమెంట్‌కు దూరం అవుతున్నాడు. ఈ మధ్యనే సర్జరీ కూడా అయ్యింది. ఇక జై రిచర్డ్సన్ కూడా గాయంతో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరం అవుతున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కూడా గాయంతో 2023 ఐపీఎల్‌కు దూరం అవుతున్నాడు.

గతేడాది సెప్టెంబర్‌లో గోల్ఫ్ ఆడుతూ జానీ బెయిర్‌స్టో గాయాలపాలయ్యాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంకా అతనికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వనందున తను ఈ ఐపీఎల్‌లో ఆడుతాడా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.నోర్టే కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో వెన్నునొప్పి కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. బీసీసీఐ ఇంకా అయ్యర్ పై ఎటూ తేల్చలేదు. ఇక ప్రసిద్ కృష్ణకు అయిన ఫ్రాక్చర్‌తో ఐపీఎల్ 2023కి దూరం కానున్నాడు.


మొత్తానికి ఐపీఎల్ 2023కి గాయాల కారణంగా పలు స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో ఆయా జట్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అదే సమయంలో ఫ్రాంఛైజీలు కూడా ఆందోళనలో ఉన్నాయి. అయితే ఇందులో కొంత మంది టోర్నమెంట్ ప్రారంభ సమయానికి గానీ లేదా మధ్యలోగానీ జట్టులో చేరుతారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications