గుజరాత్ గడ్డపై రోహిత్ శర్మ క్రేజ్ మామూలుగా లేదుగా..!!

అహ్మదాబాద్: ఇంకో మూడు రోజులు. లక్షలాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ జట్టు ఫైనల్స్ చేరడం ఇది పదోసారి. ఫైనల్స్‌లో ధోనీ సేనను ఢీ కొట్టే జట్టు ఏదనేది ఇంకా తేలాల్సి ఉంది.

మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్‌ 1లో గుజరాత్ టైటాన్స్‌ను ధోనీ సేన మట్టికరిపించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ దాన్ని ఛేదించలేకపోయింది. 157 పరుగులకు కుప్పకూలింది. 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

IPL 2023, Qualifier 2, GT vs MI: Fans queue at Ahmedabad for the tickets

ఫైనల్స్‌కు చేరడానికి రెండు జట్లు రేసులో ఉన్నాయి. ఫైనల్‌ బెర్త్ కోసం హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇది రెండో క్వాలిఫయర్. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళ్తుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.

బుధవారం చెన్నై చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చివరి లీగ్‌లో సెంచరీ బాదిన కామెరాన్ గ్రీన్.. మరోసారి మెరిశాడు. 41 పరుగులు చేశాడు. ముంబై ఇన్నింగ్‌లో అతనే టాప్ స్కోరర్.

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ తక్కువ పరుగులే చేసినప్పటికీ- సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా జట్టును ఆదుకున్నారు. చివరి ఓవర్లల్లో వధేరా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 12 బంతుల్లోనే 23 పరుగులు పిండుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 101 పరుగులకే పెవిలియన్ చేరింది. 40 పరుగులు చేసిన మార్కస్ స్టొయినిస్ ఒక్కడే టాప్ స్కోరర్. ముంబై బౌలర్ ఆకాశ్ మధ్వాల్ అయిదు వికెట్లతో లక్నో బ్యాటర్ల నడ్డివిరిచాడు.

ఈ విజయం ఇచ్చిన ఊపుతో రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత గడ్డపై ఓడించడానికి సన్నద్ధమౌతోంది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ప్రత్యేకించి- రోహిత్ శర్మను చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నారు. రెండో క్వాలిఫయర్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం అహ్మదాబాద్ స్టేడియం వద్ద అభిమానులు బారులు తీరారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+