IPL 2023 : నీ రికార్డుల కోసం చూసుకుంటావా ? శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ పై సెహ్వాగ్ అసంతృప్తి...
ఐపీఎల్ 2023లో విరాట్ కొహ్లీ ఐపీఎల్ బ్యాటింగ్ రికార్డు దాటేస్తాడని అంతా అంచనా వేస్తున్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఆ దిశగా దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ ఆటతీరు మాత్రం కాస్త విమర్శలకు తావిచ్చింది. ఈ మ్యాచ్ లో రికార్డు కోసం గిల్ మెల్లగా బ్యాటింగ్ చేయడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్బుబడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు.
ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ కీలకంగా మారాడు. నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం స్లో బ్యాటింగ్ తో విసిగించాడు.ఈ మ్యాచ్ లో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. మరో 9 బంతుల్లో 67 పరుగులకు చేరుకుని అవుటయ్యాడు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ముఖ్యంగా ఈ మ్యాచ్ లో గిల్ పేలవమైన స్ట్రైక్ రేట్ ను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా విమర్శించారు. ఛేజింగ్‌లో గిల్ హాఫ్ సెంచరీ చేయడంతో గుజరాత్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ గిల్ ఆరంభంలోనే దూకుడుగా ఆడి ఉంటే మ్యాచ్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగేది కాదని సెహ్వాగ్ తెలిపాడు. గిల్ 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు కానీ అతను తన హాఫ్ సెంచరీకి ఎప్పుడు చేరుకున్నాడు? బహుశా 41-42 బంతుల్లో తన యాభైకి చేరుకున్నాడు కాబట్టి 7-8 బంతుల్లో అతను మరో 17 పరుగులు చేశాడు. అతను తన యాభైకి చేరుకున్న తర్వాత అక్కడ వేగం పెరిగింది. అది కూడా జరగకపోతే గుజరాత్ చివరి ఓవర్‌లో 7కి బదులుగా 17 పరుగులు చేసి ఉండేవాడంటూ సెహ్వాగ్ క్రిక్‌బజ్‌లో పేర్కొన్నాడు.

నన్ను యాభై పరుగులు చేయనివ్వండి, అప్పుడు మ్యాచ్‌లో ఎలాగైనా గెలుస్తామని మీరు అనుకోలేరంటూ సెహ్వాగ్ గిల్ కు చురకలు అంటించాడు. ఇది క్రికెట్, మీరు టీమ్ ప్రదర్శన గురించి కాకుండా మీ ప్రదర్శన గురించి ఆలోచించినప్పుడు మీకు క్రికెట్లో దెబ్బలు తప్పవన్నాడు. ఇందుకు ఉదాహరణగా గిల్ యాభైకి చేరుకున్నప్పుడు 200 స్ట్రైక్ రేట్‌తో ఆడితే, అతను తన మైలురాయిని చాలా ముందుగానే చేరుకుని, తన జట్టుకు మరిన్ని డెలివరీలను ఆదా చేసి ఉండేవాడని సెహ్వాగ్ విశ్లేషించాడు.












Click it and Unblock the Notifications