ఏమీ సామి..? పుణ్యక్షేత్రం వద్ద వ్యభిచారం.. విటులు అరెస్ట్

పుణ్యక్షేత్రం అయితే ఎలాంటి అనుమానం రాదు. అదే అసాంఘిక కార్యక్రమాలకు.. మందు, చిందు అయితే మేనెజ్ చేయొచ్చు.. కానీ వ్యభిచారం కష్టం కదా.. అందుకే కొందరు ప్రబుద్దులు పుణ్యక్షేత్రాలను ఎంచుకుంటున్నారు. అక్కడ అయితే ఎలాంటి అనుమానం రాదు కదా అనుకుంటున్నారు. తమ దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. ఇదివరకు వేములవాడలో ఇలాంటి వ్యవహారం వెలుగుచూసింది. ఇతర చోట్ల కూడా ఆడపా దడపా జరిగాయి. తాజాగా కొండగట్టులో జరిగింది. తనిఖీ చేయగా వ్యభిచార వ్యవహారం బయటపడింది.

కొండగట్టులో ఇలా..

కొండగట్టులో ఇలా..


కొండగట్టు.. ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయం గల పుణ్యక్షేత్రం. ఇక్కడ మంగళ, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొండగట్టు దిగువన ఉన్న శ్రీ వీరాంజనేయ అద్దె గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మల్యాల పోలీసులు కొండగట్టులో తనిఖీలు నిర్వహించారు. అయితే ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇద్దరు మహిళలు, ఒక విటుడు పట్టుబడ్డారని ఎస్సై చిరంజీవి తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బాధిత మహిళ కాకుండా గదుల నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌తోపాటు మిగతా ఇద్దరిని అరెస్టు చేశామని వివరించారు.

 జగిత్యాలలో కూడా

జగిత్యాలలో కూడా

ఇటు మరోవైపు జగిత్యాలలో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారంతో పోలీసులు దాడిచేశారు. ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. జగిత్యాలకు చెందిన ఒక మహిళ ఇతర ప్రాంతాలకు చెందిన యువతులను తీసుకువచ్చేది. తిమ్మాపూర్ ఊరి చివరలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. పోలీసులకు అందిన సమాచారంతో దాడి చేసి ఇద్దరు విటులను నిర్వాహకురాలితో సహా ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.

ఇక్కడే ఎందుకంటే..

ఇక్కడే ఎందుకంటే..

పుణ్యక్షేత్రంలో వ్యభిచారం చేసి.. ఆ ప్రాంతాన్ని మలినం చేస్తున్నారు. అక్కడే వ్యభిచారం చేయడంలో వారి వాదన వారికి ఉంది. పుణ్యక్షేత్రం అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తారు. అంతేకాదు తనిఖీలు ఉండవు. ఎవరూ పట్టించుకోరనే అభిప్రాయం ఉంది. ఇన్నాళ్లూ అలానే ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ చోట్ల తనిఖీలు చేస్తున్నారు. దీంతో వారి ఆగడాలు చెల్లడం లేదు. అలా కొండగట్టు, జగిత్యాలలో జరిగిన ఉదంతాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+