కాపురంలో కలహాలు, మేనమామ ఇంటికొచ్చిన భార్య, భర్త కాల్పులు జరపడంతో హైటెన్షన్
భార్యభర్తల మధ్య కలహాలు కాల్పులకు దారితీశాయి. వారి మధ్య సఖ్యత లేకపోవడంతో.. తనకు భర్త వద్దని మేనమామ ఇంటికొచ్చింది. విషయం తెలుసుకున్న భర్త.. తుపాకీ తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. అయితే అడ్డొచ్చిన భార్య మేనమామకు తూటాలు తగిలాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జగిత్యాల జిల్లాలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

కాపురంలో కలహాలు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారానికి చెందిన ప్యాట శ్రీనివాస్‌కు గీతికతో వివాహామైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారి మధ్య సఖ్యత లేకుండా పోయింది. దీంతో భర్త ఇంటి నుంచి గీతిక పిల్లలను తీసుకొని వచ్చేసింది. తన సొంతింటికి వెళ్లకుండా మేనమావ వద్దకెళ్లింది. గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లిలోని మన మావ బైరం రాజిరెడ్డి ఇంటికొచ్చింది.

తుపాకీ తీసుకొని
తన భార్య ఇస్రాజ్‌పల్లిలో ఉంటుందని శ్రీనివాస్ తెలుసుకున్నాడు. మరొకరిని తీసుకొని సోమవారం అర్ధ రాత్రి ఇంటికొచ్చాడు. ఇంతలో భార్యతో మాట మాట పెరిగింది. ఇంకేముంది అప్పటికే తనతో తీసుకొచ్చిన తుపాకీతో భార్యను కాల్చేశాడు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన రాజిరెడ్డి అడ్డొచ్చాడు. అడ్డొచ్చిన రాజిరెడ్డి శరీరంలోకి బుల్లెట్లు దూసుకొచ్చాయి. వెంటనే అతడిని జగిత్యాల జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు.

బుల్లెట్లు స్వాధీనం
ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి శ్రీనివాస్‌కు తుపాకీ ఎక్కడినుంచి వచ్చిందనే అంశంపై ఆరాతీస్తున్నామని పేర్కొన్నారు. భార్యపై కాల్పులు జరిపేందుకు కారణం ఏంటనే అంశంపై కూడా ఆరా తీస్తున్నామని జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ తెలిపారు. రెండు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications