జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాలకవర్గానికి క్యాన్సర్ అట.. అధికార పార్టీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

అధికార పార్టీలో విమర్శలు చాలా అరుదు.. వారు రెబల్ అయితే తప్ప కామెంట్ చేయరు. ఏపీలో అయితే రఘురామ అయితే వార్ వన్ సైడ్‌లా కొనసాగుతోంది. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మెజార్టీ ఉన్నందున ధిక్కారం తక్కువే.. కానీ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం మున్సిపల్ పాలకవర్గంపై కామెంట్ చేశారు. అవును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కామెంట్ చేశారు. జగిత్యాల మున్సిపల్ పాలకవర్గంపై హాట్ కామెంట్స్ చేశారు. బాడీకి ఏకంగా క్యాన్సర్ రక్కసి వచ్చిందని వివరించారు.

వైరల్

వైరల్


సంజయ్‌ కుమార్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వాకర్స్ వెలిఫేర్‌ అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపల్ పాలక వర్గానికి క్యాన్సర్ వచ్చిందని అన్నారు. జగిత్యాల బల్దియా రోగం త్వరలో బాగు చేయాలి అని కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చెబితే మున్సిపల్ చైర్మన్ వినడం లేదా..? వారి మధ్య తేడాలు ఎక్కడ వచ్చాయనే సందేహాం కలుగుతుంది. టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అంతా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు.

గిప్ట్‌గా ఇవ్వాలి..

గిప్ట్‌గా ఇవ్వాలి..


హరితహారంలో అందరూ పాల్గొనాలని కోరారు. భావి తరాలకు చెట్లు బహుమానంగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ప్రభుత్వం అయినా వంద శాతం పనులు చేయదని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం అన్నారు. కరోనా రాకపోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి అభిప్రాయపడ్డారు. కానీ జగిత్యాల పాలకవర్గంపై ఆయన చేసిన కామెంట్లు మాత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఈ కామెంట్లపైనే తెగ చర్చ జరుగుతుంది.

Recommended Video

Telangana : ఇలాంటి తహశీల్దార్ కదా ప్రజలకి కావాల్సింది..! || Oneindia Telugu
రాజీనామా అని..?

రాజీనామా అని..?


వాస్తవానికి సంజయ్ కుమార్.. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన దురుసుగా బిహెవ్ చేసే నేత కూడా కాదు. కానీ సొంత పార్టీకి చెందినవారిపై కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా మసులుకోలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన పదవీకి రాజీనామా చేస్తానని చెప్పారు. అదీ కూడా కవిత పోటీ చేస్తానని చెబితే అన్నారు. తర్వాత సైలంట‌్‌గా తన పని తాను చేసుకొని వెళుతున్నారు. ఇంతలో ఓకేసారి.. ఇలా తన కన్నా దిగువస్థాయి వారిపై విరుచుకుపడటం చర్చకు తావిచ్చింది.

English summary
Jagtial Municipality have a cancer disease trs party mla sanjay kumar comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X