మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

అనారోగ్యంతో బాధపడుతున్న వేంపేట మాజీ సర్పంచ్ శ్రీమతి సుద్దాల అనసూయను మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం అనసూయ అనారోగ్యానికి గురయ్యారు. పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇంటి వద్ద ఫిజియోథెరపి జరుగుతుంది. గురువారం జీవన్ రెడ్డి అనసూయను ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 mlc jeevan reddy asked to ex sarpanch health

అంతకుముందు వేంపెటలో మామిడి నారాయణ రెడ్డి పరామర్శించారు. ఆయనకు ఇటీవల చేపట్టిన ఆందోళనలో గాయపడ్డ సంగతి తెలిసిందే. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న ఉపసర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ తండ్రి గోరుమంతుల పెద్దులును కూడా జీవన్ రెడ్డి పరామర్శిచారు. అంతకుముందు బండలింగపూర్‌లో ద్యావతి గంగాధర్ కుమారుడు చనిపోవడంతో పరామర్శించారు.

వారి వెంట జిల్లా కాంగ్రెస్ కిసాన్ మోర్చా నాయకులు వాకిటి సత్యం రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జెట్టి లింగం, మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ అల్లూరి మహేందర్ రెడ్డి, ఏనుగు బుచ్చిరెడ్డి, ఏనుగు భూ లక్ష్మి, మెట్‌పల్లి కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఖుతుబుద్దీన్ పాషా, మెట్‌పల్లి కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ అంజిరెడ్డి , కొమిరెడ్డి లింగారెడ్డి, మాజీ ఎంపీపీ కే వెంకటస్వామి, కౌన్సిలర్ షాకిర్, వేంపెట్ ఉపసర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి సురేందర్ రెడ్డి, నల్ల శేఖర్ రెడ్డి, తుమ్మల సునీల్,ఎలాల తిరుపతి, అరవింద్ తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+