జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శభాష్ సుజాత, రెవెన్యూ వ్యవస్థలో ఆణిముత్యం, ఇంటికెళ్లీ మరీ రిజిస్ట్రేషన్..

|
Google Oneindia TeluguNews

అవినీతి, అక్రమాలు జరిగేది, ఎక్కువ ఛాన్స్ ఉంది రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలే. వీటిలో అవినీతి పేరుకుపోయింది. అందుకే సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖపై కాస్త గుస్సాతోనే ఉంటారు. వీఆర్వో వ్యవస్థ రద్దు, ధరణి పోర్టల్ క్రియేట్ చేసి.. అన్నీ ఆన్ లైన్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడమే.. వాస్తవానికి ఇదీ మంచి పద్దతి కూడా.. కానీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌లో ఉన్న వారు కొందరీ అవినీతి మాత్రం తగ్గడం లేదు. ఆడపా దడపా అలాంటి వార్తలను చూస్తూనే ఉన్నాం. అయితే జగిత్యాల జిల్లాలో ఓ తహశీల్దార్ మాత్రం తన వృత్తికి, వ్యవస్థకు మంచిపేరు తీసుకొస్తున్నారు.

శభాష్ సుజాత..

శభాష్ సుజాత..

పక్కన ఫోటోలో ఉన్న ఆమె గురించే మనం ఇప్పటివరకు డిస్కష్ చేసింది. పేరు సుజాత.. తహశీల్దార్‌గా పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో కొలువు.. కానీ అందరు తహశీల్దార్ల మాదిరిగా డాబు, దర్పం ప్రదర్శించారు. ఏదైనా పని వెంటనే.. అవినీతికి తావులేకుండా చేస్తారు. ఇటీవల మల్యాల మండలం తక్కలపెల్లి గ్రామానికి చెందిన కమల అనారోగ్యానికి గురయ్యారు. జగిత్యాలలో ఆక్సిజన్ మీద ఉన్నారు. వైద్య చికిత్సకు డబ్బులు కావాలయే.. తన భూమిని అమ్మాలని అనుకున్నారు. కానీ స్లాట్ బుక్ చేసి, ఆఫీసుకు వెళ్లీ మరీ ప్రక్రియను పూర్తి చేయాలి. అలా వెళ్లేందుకు కమల ఆరోగ్యం సహకరించలేదు. ఫోటోలో కూడా ఆమె బెడ్ మీద ఉన్న సంగతి తెలిసిందే.

ఆపరేటర్‌ను తీసుకొచ్చి..

ఆపరేటర్‌ను తీసుకొచ్చి..


ఎలా రా భగవంతుడా అని అనుకుంటుంటే.. తహశీల్దార్ సుజాత రూపంలో గండం గట్టెక్కింది. విషయం తెలుసుకున్న సుజాత.. నేరుగా బాధితురాలి వద్దకు వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 20 గుంటల జాగా అమ్ముతానని చెబితే అక్కడే రిజిస్ట్రేషన్ చేశారు. ఆపరేటర్‌ను తీసుకొచ్చి.. ల్యాప్ టాప్‌లో ప్రాసెస్ చేశారు. దీంతో కమల భూమి అమ్ముడుపోయింది. చేతికి డబ్బులు వచ్చి.. అనారోగ్యానికి చికిత్స చేసుకోబోతున్నారు. తహశీల్దార్ సుజాతకు.. కమల అండ్ ఫ్యామిలీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

రేపు, మాపు అని తిప్పేవారు

రేపు, మాపు అని తిప్పేవారు


రెవెన్యూ వ్యవస్థలో డబ్బులు ఇచ్చిన పనులు కావు.. రేపు రా, మాపు రా అని తిప్పుతారు. కానీ తహశీల్దార్ సుజాత మాత్రం మంచి పనిచేశారు. చాలా మంచి పని చేసి.. కమలను ఆదుకున్నారు. ఈ ఘటనను అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు. మిగతావారికి ఆదర్శంగా నిలిచారని కొనియాడుతున్నారు. ఇదివరకు లంచాల విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుజాత లాంటి వల్ల ఆ మరక రెవెన్యూ వ్యవస్థపై కొంతయినా పోయే అవకాశం ఉంది.

English summary
Mallial tahsildar sujatha gone to kamala home with computer operator. done her land registration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X